Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాలోలసృక్వాగ్రలాలాద్రవం బనునలఁతి నీరుననారె నడ్డియద్ది
యత్యంతభయదజిహ్వాంచలం బనునాకు ఱాతిచే నారెకు రాచి రాచి
త్రాఁచువాకొల్మియందుఁ గందంపుఁగొండ, యోజ ని న్నాశుగముఁ జేసి యొసఁగె నతనుఁ
డేయఁ గాఁబోలుఁ బవన కా దేని సకల, జీవనం బగునీ వింత సేయు టెట్లు.

91


చ.

అని సుమబాణచైత్రపవనాబ్జుల నెచ్చెలి దూఱునంతలోఁ
దనువున హెచ్చినట్టి పరితాపము సైఁపఁగలేక యప్పు డ
వ్వనరుహపత్రనేత్ర నెఱవా డెడుక్రాల్గనుదోయి ఱెప్ప లొ
య్యనఁ గదియించి సంజ్వరభరాలసయై పొరలాడునంతటన్.

92


చ.

చెలి కలఁకం దలోదరికిఁ జెందిన తాపముఁ [1]బాపు నేర్పునం
జలువలు నింపఁగాఁ దలంచి నారెఁ బటీరతుషారనీరముల్
తలిరులుఁ గప్రము ల్గుముదతామరసంబులు నించి యైందవో
పలకృతవేదికాతలముపై మృగలోచన నుంచి గొబ్బునన్.

93


క.

విలువ యిడరాని చలువలు, చెలువకు నొనరించి [2]పయినుశీరవ్యజనో
చ్చలనజనితమందానిల, వలనంబునఁ గొంతకొంత వా డెడలింపన్.

94


క.

తనుపొంది యొయ్యనొయ్యన, కనుదమ్ములు విచ్చిచూచి క్రమ్మెడు కన్నీ
రనయము ఱెప్పలఁ గ్రుక్కుచు, సనియెం జెలితోడ ధైర్య మవలంబముగాన్.

95


సీ.

చెలియ నేఁ బెంచిన యెలమావిమోకకు సేవంతికకుఁ బెండ్లి సేయవమ్మ
సుదతి నే సాఁకిన శుకశారికల దేవతామందిరములకుఁ దార్పవమ్మ
మగువ నేఁ బెంచిన మరువంపునుడికట్టు లప్పటప్పటికిఁ బెం పరయవమ్మ
[3]పడఁతి నే నడపిన బాలసారంగంబు ఋషినివాసముల కర్పింపవమ్మ
యబల నాతోడఁ గెడఁగూడి యాడునట్టి, నెచ్చెలుల నెల్ల నీవు మన్నింపవమ్మ
భావిజని నైన నాతఁడె భర్త యగుట, కింతి మరునకు మే నప్పగింతుఁ గాన.

96


చ.

అనుచు వడిం గడంగి కుముదాప్తునికై యెదు రేగునంతలో
ఘననిభవేణి వ్రీలుటయు గ్రక్కునఁ బువ్వులం రాలెఁ దో నురం
బునఁ జొరఁబాఱినట్టి యలపూర్ణశశాంకమయూఖపంక్తి వె
న్నున వెసదుస్సి పాఱె నన నూత్నసరోరుహపత్రనేత్రకున్.

97


క.

అత్తఱి సఖి డగ్గఱి యా, బిత్తరిఁ దనబాహులతల బిగియించి కడున్
మెత్తని మేచెమటలు వడి, నొత్తుచు విధుమణివితర్ది నునిచినయంతన్.

98


చ.

కలఁక తలంక నేత్రములకాఁకఁ దెరల్పఁగఁ జేరవచ్చెనో
పలుమఱు నేత్రరాజ మనఁ బయ్యెద కొంగు మెఱుంగుఁగన్నులన్

  1. చ-మాపు
  2. క-చెలులుశీర
  3. చ-వనిత