Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యుపధ పెట్టఁగఁబోలు మహోగ్రకాళి. వాయురధ మనుపేర నిశ్వాసపంక్తి
కాకయుండిన వారూరకయ వసింపఁ, నీ వెపుడు లోక మేర్తువే భావజన్మ.

85


సీ.

కోకస్తనియటంచుఁ గుందింపజూచితే తరుణచకోరాక్షి యరయరాదె
యరవిందపద యంచుఁ బొరపొచ్చె మెందితే కువలయామోద గైకొనఁగరాదె
తిమిరకైశిక యంచుఁ దెగువమైఁ జూచితే కౌముదీనరహాస కావరాదె
యహిరోమలత యంచు నలయింపవచ్చితే తారకాసఖ దయఁదలఁపరాదె
యహితగుణశాలిని యటంచు ననకయాప్త, నివహలీలాభిరామ మన్నింపరాదె
చాలఁ జెప్పెడి దేమి యీచంద్రవదనఁ, బ్రోవఁగారాదె పౌర్ణమాసీవిలాసి.

86


సీ.

జింకపేరిటఁ గందఁజేసె నింతియకాని హరుఫాలశిఖి చాల నంటదయ్యె
మించుపేరిటఁ గరఁగించె నింతియ కాని బాడబశిఖ క్రిందుపఱుపదయ్యెఁ
గాంతిపేరిట నీఱు గప్పె నింతియ కాని రాహుదంష్ట్రాగ్ని మై బ్రాఁకదయ్యె
నుదయరాగముపేరఁ [1]బొదిగె నింతియ కాని ప్రాగద్రిదవ మాత్మఁ బఱపదయ్యె
నకట నీ వోషధీశుఁడ వగుటఁ జేసి, సంతరించితివో శిఖిస్తంభనంబుఁ
గాకయుండిన నవి నిన్ను గ్రాఁచకున్నె, పాంథసంతతిపుణ్య మాపాటి చంద్ర.

87


[2]సీ.

మొదల మహాబిలంబునఁ దేజరిల్లుట కుండలాకృతిని నిందుండ వగుట
విషముతోఁ గూడ నావిర్భావ మందుట బహుపాదవిస్ఫూర్తిఁ బాఁదుకొనుట
సడలనీక శశంబుఁ గడిమిమైలోఁ గొంట యాబాల్యకౌటిల్య మందుకొనుట
రాజితవీక్షణశ్రవణాంచితుఁడ వౌట తరుణమరుద్గ్రాసతనువుఁ గొనుట
నీవు పెనుబాఁపఱేఁడవై నిలిచి తరయఁ, గ్రూరభావంబు నీ కసాధారణంబు
భయదవిషధారి తలక్రిందుపఱుపఁజాలఁ, డితఁడు నీలీల నీలకంఠావతంస.

88


చ.

ఎలమి శుకాదికద్విజసమీహితదివ్యఫలప్రదుండ వై
యలరుచుఁ గాలకంఠనుతి కర్హుఁడవై సుమనోనురాగి వై
యలఘు[3]మరుత్సమాశ్రయుఁడ వై తగుమాధవ నీవు నీసుదృ
క్కుల నలయింతువే మధుపకోటులఁ బంచి దయావిహీనతన్.

89


చ.

అలులు మధువ్రతంబులు సుమాస్త్రుఁ డనంగుఁడు పక్షపాతి చు
క్కలదొర కోకిలంబు బలుకాకులపెంపుడుగున్న ప్రాప్తస
త్ఫలదళనం బొనర్చు శుకపంక్తి యివన్నియుఁ ద్రోఁచి పోవఁగాఁ
దలఁచిన నోసదాగతి సదాగతి వీవసుమీ లతాంగికిన్.

90


సీ.

ప్రత్యగ్రవక్ర[4]దంష్ట్రాశిఖాచయ మనుపట్టుకాఱుల సారెఁ బట్టిపట్టి
శా.................లమానవిషములన్ కఱకుమంటల సారెఁ గాఁచికాఁచి

  1. చ-బొదలె
  2. చ-ట-లలో లేదు.
  3. చ-మరుత్సఖా
  4. క-దంష్ట్రాశుగ