Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మృతప్రదుం డగువిధుండు దయార్ద్రహృదయుండై యఖిలభువనంబు సత్త్వప్ర
ధానంబు గావించె నన మించి రోదసీవలయంబు కర్పూరఫలకకల్పితం
బనుశంక నంకురింపఁజేయుచు విజృంభించె నట్టిసమయంబున.

79


క.

కంతునకుఁ దోడు రాకా, కాంతుఁడు కరకాండముల వెగడుపడఁజేయం
గాంతాలలామ కంతట, నంతంతకు మేనికాఁక యగ్గల మైనన్.

80

మన్మథాద్యుపాలంభనము

క.

నెచ్చెలి వెచ్చగ నూర్చుచు, విచ్చలవిడిఁ బెచ్చు పెరిఁగి వెగడుపఱుచు నా
పచ్చవిలుకానిజైత్రమ, రుచ్చంద్రుల ననియె నత్యరుంతుదఫణితిన్.

81


సీ.

రాజమండల మాత్మవాజిసంభరణపాత్రము చేసె జగత్ప్రాణమూర్తి
బహువాహినీభర్తఁ బ్రబలాత్మకేతుచయంబు మోయించె నేయసమశరుఁడు
దుర్గాధిపతిమౌళి దొరయించె నాత్మపాదవిజృంభణంబు నేకువలయాప్తుఁ
డతిగంధతరులచే నాత్మానుగశ్రేణిఁ బూనించె నేసుమనో[1]నిధానుఁ
డట్టిదాక్షిణ్యశాలియు నట్టియతనుఁ, డట్టిసన్మార్గవర్తనుఁ డట్టిసురభి
కీర్తనుండును నీరీతిఁ గెరలిభీరు, హనన మొనరింపఁ గడఁగి రేమనఁగఁగలదు.

82


సీ.

అంధకప్రియసూతి వై విషపంకసంకలితాంకము వహించుఖలుఁడ వీన
యనయమ్ము నెత్తమ్ములనె మాఱుకొని సత్ప్రధానత లెఱుచు నీ మేనమామ
ధరణి నెల్లెడఁ బ్రసూతప్రసవఖ్యాతి వహియించి తిరుగు నీసహచరుండు
భాసురద్రుపదజాపాండుచ్ఛదాపకర్షణదంచలుండు నీసహజమిత్రుఁ
డకట దర్పక మీరు కృష్ణాలకాప, కారవైరస్యమున ధర్మదూరు లగుట
భీమవిజయాహితగుణానభిజ్ఞవృత్తి, నవని దుష్టచతుష్టయం బగుట యరుదె.

83


చ.

కనుగలవిల్లు నంటకయ [2]ఖంగని మ్రోయుగుణంబు గంటిలే
కనె యిరుమేనఁ గాఁడిచనుకాండములుం గలయట్టిమేటి జో
దున కతనుప్రభావున కెదుర్పడ లక్ష్యముగారు భీరువుల్
మనసిజ దోస మాఁడుకొల మానఁగదయ్య తలంచి మ్రొక్కెదన్.

84


సీ.

ఒసఁగఁగాఁబోలుఁ గల్పోదగ్రహరమూర్తి పుష్పచాపముపేర భ్రుకుటిలతిక
దయసేయఁగాఁబోలు లయకాలశిఖి యలిస్తోమశింజినిపేర ధూమరేఖ
సంఘటింపఁగఁబోలు సంవర్తసమవర్తి టంకారములపేర హుంకృతములు
కరుణింపఁగాఁబోలుఁ గల్పాంతరవిహల్లకాస్త్రసంఘముపేర నంశువితతి

  1. చ-నిధాన మట్టి
  2. చ-ఖంగున వారియగంటిలేక గ్రక్కన