Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిలిపి లతాంగి యేడ్చె మది నెవ్వగతోఁ గురరీపరంపరా
కలితనవీనదీనతరకాకలికాకలనిస్స్వనంబునన్.

99


క.

ఈరీతి నెమ్మనమ్మున, గూరిన వగ నేడ్చునట్టి కుముదిని నెదపైఁ
జేరిచి చెక్కుల డిగుక, న్నీరు కరాబ్జమునఁ దుడిచి నెచ్చెలి వలికెన్.

100


చ.

వదలుదురమ్మ యాత్మకులవర్తన మీలువు దూలి సారెకున్
బదరుదురమ్మ లేఁదలిరుఁబ్రాయవుమేని నలంతురమ్మ యి
ట్లదరుదురమ్మ మండుశశికైనఁ దలంకక పండువెన్నెలన్
గదియుదురమ్మ యిత్తెఱఁగు కన్నెకుఁ జెల్లునటమ్మ నెచ్చెలీ.

101


మ.

మెలఁతా నీ విఁకఁ జింత సేసెదవు సుమీ వీరసేనుండు నీ
లలితోద్యానముఁ బాసి వచ్చి నిజలీలాగేహముం జేరె నా
చెలువుం డచ్చట నుండఁబోలు నిఁక నీచేకంకణం బిమ్ము నే
నల కేళీవని కేగి యీక్షణమె నీప్రాణేశుతోఁ దెల్పెదన్.

102

తరళిక చంద్రభానుకడ కేగుట

క.

అని తెలియఁబలికి యపు డా, వనితకుఁ గ్రమ్మఱఁగ శిశిరవస్తువు లెల్లం
బనుపఱిచి యాకెవలయము, తనచేఁ గొని కూర్మిబోటి తరళిక యంతన్.

103


ఉ.

చెంతఁదనర్చు కేళివనిఁ జేరి నికుంజము లెల్లఁ గాంచి య
త్యంతసుగంధబంధురలతాంతనితాంతవిలోలగుచ్ఛకా
శ్రాంతసరన్మరందరససంగతభృంగతతారవావృతా
శాంతలతావితానకలికాలయ మొక్కటి డాయవచ్చినన్.

104


క.

మును తా వీణియ మీటుచుఁ గనుఁగొన్నలతాంగిరూపు కన్నులయెదుటన్
గనుపట్టఁ జంద్రభానుఁడు, మనసిజశరధూయమానమానసుఁ డగుచున్.

105


ఉ.

నీపవనీధునీకమలినీమకరందమిళన్మిలిందగ
ర్జాపటుఝుంకృతుల్ సయిఁపఁజాలక నీలకచాకుచాంతరా
రోపిత మైనడెందము మరు ల్మగిడింపఁగలేక చిక్కి లీ
లాపరికల్పితైందవశిలాతలశీతలవేదికాస్థలిన్.

106


క.

పవళించి చందనాచల, పవమానకిశోర[1]చలితఫలగళితరసా
సవమత్త[2]కీరశారీ, రవములు బెట్టుగ హృదంతరం బెరియింపన్.

107


క.

తలపోయుఁ దలఁకు నలుకుం, దలవంచుం దత్తఱించుఁ దహతహపడు లోఁ
దిలకించుం బులకించుం, బలికించు న్బట్టబయల భామా యనుచున్.

108
  1. చ-జనితఫల
  2. క-కీరశాదికరవములు