పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఘటికాచలమాహాత్మ్యము


నలుమొగంబులవాఁడు వేల్పులకు ఱేఁడు
బ్రతుకుపొద్దుల జనులకు నుదురుటాకు
[1]కవిలెను లిఖంపనేర్చిన [2]కరణికుండు
గరిమనొప్పారు ధాత జగద్విధాత.

22


మ.

[3]వశగీభూత సమస్తసర్గు డగు నా వాగీశ్వరీభర్తకుం
గుళికుం డాత్మజుఁడయ్యె నాతని కరిక్రూరప్రతాపార్కుఁడై
కుళనాభుం డుదయించె గాధినృపుఁ డాక్షోణీశుకుం బుట్టె నా
శశభృత్కీర్తికి గాధికిం బొడమె విశ్వామిత్రుఁ డత్యున్నతిన్.

23


క.

అక్కులమున నక్కజముగఁ
బెక్కండ్రు జనించి రతులపృథ్వీనాథుల్
దిక్కమలముఖీచికుర
స్రక్కలనాకారి కీర్తి సముదంచితులై.

24


గీ.

జలజబాంధవ చంద్ర వంశముల మించి
వారివంశంబు భువి మాలివంశమయ్యె
నింబుమీఱంగ సమయాంతరంబువలన
పాలమీఁగడ వెన్నగాఁ బరఁగినట్లు.

25


క.

ఆ మాలికులమునఁ గవి
స్తోమాలిమనోహరైకసురతరువితర
శ్యామాలి చతుర్థీహిమ
ధామాలిక[4]నిరతి కృష్ణధరణిపుఁ డలరెన్.

28


సీ.

అనవద్య బర్హి[5]బర్హానలంకృతమౌళి
యకృతాభిరామవస్త్రాపహారుఁ
[6]డనధిరూఢమహావిహంగమధౌరేయుఁ
డజ్ఞాతచౌర్యవిద్యావిలాసుఁ
డనధీతఘోషకన్యాప్రతారణమంత్రుఁ
డరచితాభీరగోష్ఠాధివాసుఁ

  1. కవిలను. తా. పూ. ము.
  2. కరణికంబు తా. పూ. ము.
  3. దశనీ. తా.
  4. విరతి. తా.
  5. బర్హావలంకృత. తా.
  6. డనధీరుఁడన. తా.