పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

5


సదభిద్యద్గిరిరాజసోదరత యెచ్చన్ మించు పుంభావ[1]శా
రద వీవే గద వన్న వేంకటగిరీంద్రా! సాంద్రమేధానిధీ!

17


క.

విదితప్రబంధములు వే
డ్కదనరఁగ మదంకితముగఁ గావించి ననున్
మొదల పవిత్రము చేసితి
సదయాత్మా! విచిత్రరాయచంద్రవతంసా!

18


గీ.

ధరణి తొమ్మిది లిబ్బులు దాఁచుకొన్న
వానికైనను ధనకాంక్ష పోనియట్లు
కృతులు పదివేలు గైకొన్నఁ గీర్తికాముఁ
డైనవానికిఁ జనదు కావ్యాభిలాష.

19


ఉ.

కావున రామకృష్ణకవికల్పితకావ్యమొకండు దెచ్చి స
ద్భావముతోడ నా కతనిపౌత్రుఁ డొసంగె మదంకితంబుగా
నీవిఁక హారనాయకమణిప్రతిమానముగా మదీయవం
శావళి చెప్పి కూర్పుము యశంబు భృశంబుగ సంఘటిల్లఁగన్.

20


వ.

అని నన్ను బహుమానపూర్వకంబుగా నఖర్వకార్తస్వరదుకూలసారఘనసారవాసనాలోలతాంబూలంబుల నాదరించుటయు నేను పరమామోదసంభరితాంతరంగుండనై యభినవంబుగను గృతివిభు నభిజనావళి నభివర్ణించెద.

21


సీ.

వాగీశ్వరీవక్త్రవనజసారంగంబు
కలహభోజనమౌనిఁ గన్నతండ్రి
సప్తలోకీచరాచరకల్పనాచణుఁ
డామ్నాయరత్నరత్నాకరుండు
కలశాబ్ధిశాయిపొక్కిలితమ్మి పసికందు
తోయజాతాస్త్రుని తోఁడఁబుట్టు
పాలును నీరు వేర్పఱచు తత్తడిరౌతు
కడుపు బంగారుబొక్కసమువాఁడు

  1. శారద నీవే గద యెన్నగా సుకవిచంద్రా! సాంద్రమేధానిధీ.
    శారద నీవే గద యెన్న వేంకట.... తా.