పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

7


డపరావనీంద్ర[1] మంత్ర్యపవారణగరిష్ఠుఁ
డకరాగ్రవేణువిఖ్యాతవాద్యుఁ
డైనకృష్ణుఁడితఁడె యని యభినుతింప
దానవారి వివర్ధనోదారశంఖ
చక్రయుతపాణిఁ బొల్చు నిర్వక్రలీల
రమ్యగుణహారి కృష్ణాజిరాయశారి.

27


మ.

అనుకంపాహరి నిమ్నతానదవిభుం డైదంయుగీనార్జునుం
డని కైవారము సేయ సార్థ మయి కృష్ణాధీశుఁడన్ పేరు పా
వనభావమ్మునమీఱ నా వరసరస్వన్మేఖలానాథుఁ డ
త్యనతారాతిచమూనికేతన దరణ్యానీకుఁడై వర్తిలెన్.

28


క.

పొంగుచుఁ గృష్ణాధీశుఁడు
భంగము లేనట్టి కీర్తిఁబడసి సముద్య
తుంగయశస్సంగాయిని
గంగాయిని బెండ్లియాడెఁ గరుణానిధియై.

29


సీ.

అపకీర్తిగతిబట్టి యాత్మేశుతలముట్టి
బెట్టుగా వడిసుళ్ళఁ బెట్టదేని
[2]చెనటిభంగముమీఱ తనవారిచెలువారఁ
దెరువేది యూరూరఁ దిరుగదేని
ఘనజడస్థితి బైట కన్నవారలనోటఁ
బడి ఱాఁగయనుమాటఁ బడయదేని
అనతోద్దతిగాక లో[3]నార్భటము లేక
మొగి నట్టు [4]వీఁకున నిగుడదేని
గంగ చెలగంగ సరియనంగా దనర్చు
పతిహితాచారధృతికి నపారకీర్తి
రతికి నన్యజనజ్ఞాతవితతమతికి
నతులకారుణ్యధృతికి గంగాయిసతికి.

30
  1. మంత్యపచార, తా.
  2. చనిన.పూ.ము. తా.
  3. నార్పడము.తా.
  4. వీఁకని తా.