పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

విశ్వాసార్హము కాదనియు చెప్పుచున్నారు[1]. "దశావతారపద్యములు - సటీకములు" అను పేర నొక కాగితపువ్రాతప్రతి మద్రాసులోని ప్రభుత్వప్రాచ్యపుస్తక భాండాగారమున కలదు[2]. ఆ కాగితపుప్రతికి మూలమైన తాళపత్రప్రతి విశాఖపట్నముజిల్లా వీరవల్లి తాలూకా పాతనపూడి అగ్రహారవాస్తవ్యులయిన కోటి రామమూర్తిశాస్త్రులుగారిది. ఆ పద్యములకు టీక వ్రాసిన పండితుడు చివర తన “గద్య" వ్రాసికొనినాడు.

"ఇతి శ్రీవత్సగోత్రపవిత్ర శ్రీమదాపస్తంబసూత్ర శ్రీమద్రఘునాథభట్టరాచార్యకృపాపాత్ర శ్రీమత్కోదండ రామాచార్యవర్యపుత్ర దుర్వాదిగర్వలతాలవిత్ర శ్రీమద్భాష్యాదిగ్రంథప్రబంధాధ్యయనాధ్యాపనవిచిత కృష్ణమాచార్యగోత్రవిరచితాఖండపండితమండలదుర్విజేయతాత్పర్యపర్యాయపిచండిల పాండురంగవిజయప్రబంధమధ్యనిధేయ హృద్యతమదశావతారపద్యమాలికా టీకానిగూఢార్థ చంద్రికా శరద్రాకాసమాప్తా"— ఈగద్య పాండురంగవిజయప్రబంధ మున్నదనుటకు సాక్ష్యమేగాని అది తెనాలి రామకృష్ణుడు రచించినదే అనుటకు కాదు. క్యాటలాగులో దానినిగూర్చి ఆంధ్రాంగ్లములలో వ్రాయువారు మాత్రము "తెనాలి రామలింగకవికృత పాండురంగవిజయమందలి దశావతార పద్యములు" "These stanzas form part of the Pandurangavijaya composed by Tenali Ramalingakavi" అని స్పష్టముగా వ్రాసిరి[3]. ఈ ఈ వ్రాతలో నింకొకవిశేషము కనిపించుచున్నది. రామకృష్ణుడు రామలింగడుగా నున్నప్పుడే

పాండురంగవిజయమును రచించినాడా? తెలుగులో పాండురంగవిజయము ఆంగ్లములో పాండురాంగవిజయమనబడినదేమి? ఈ పాండురాంగ-పాండురంగవిషయము తరువాత రామకృష్ణుని వైష్ణవమునుగూర్చి వ్రాయుచోట మరికొంత వ్రాయబడును. — ఈ దశావతారపద్యములు పాండురంగమాహాత్మ్యమున లేవు గనుక , టీక వ్రాసినయతడు ఈ పద్యములు పాండురంగవిజయమధ్యమున నున్న వనుచున్నాడుగనుక, పాండురంగమాహాత్మ్యమునే పాండురంగ విజయమనుట కుదురదు- అవి రెండు వేఱు వేఱు గ్రంథములగు

  1. ఆంధ్రకవితరంగిణి. సంపుటము 8. పుట 12. మరియు వీరేశలింగముగారి ఆంధ్రకవుల చరిత్రము. రెండవ భాగము. పుట 175.
  2. A Triennial Catalogue of Manuscripts Volume III Part III. Telugu. R. No. 542.
  3. ఈ పద్యములు ఎలకూచి బాలసరస్వతి మహోపాధ్యాయుడు రచించినవని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో వ్రాసినారు. పుట. 13.