పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

కాలమున తిరుగుటకలవాటుపడినకాలు కుదుటబడి యొకచో నిలువనట్లు ఏదో వ్రాయుట కలవాటువడిన బుద్ధి ఆ పనిచేయ కుండ నుండలేక చేయును. అట్లు చేయుటవలన నైనకావ్యమును భరించుట అంత సుఖమైనపని కాదు. రామకృష్ణు డాస్థితిలో ఘటికాచలమాహాత్మ్యమును వ్రాసివదలి పరమపదించినాడు. ఇంకొక వాదమునుగూడ చూపవచ్చును. రామకృష్ణుడు ఈ ఘటికాచలమాహాత్మ్యమును రచించి ఏదైవమునకో అంకితముగావించినాడు. ఆయన చనిపోయినతరువాత ఆయన మనుమడు ఆకృత్యాదిని తొలగించి ఖండోజీకి అమ్ముకొనియుండవచ్చును[1] - అని కావచ్చును. అట్లమ్ముకొనువాడు వీలున్నచో మిగిలినవాని నెందుకు విక్రయించినాడు కాడు? అందువలన అది పొసగదు. పాండురంగమాహాత్మ్యమున కిది తరువాతి దని యూహించినపు డిది రామకృష్ణుని కృతులలో చివరిదియే యగును[2]. ఘటికాచలమాహాత్మ్యమే రామకృష్ణుని కృతులలో కడపటిది[3].

మరొక్కవిషయము గూడ నిచట చెప్పవలసియున్నది. రామకృష్ణుడు పాండురంగమహాత్మ్యము కాక పాండురంగవిజయ మను మరొకగ్రంథమును రచించినట్లును అనుకొనుటకలదు. తమ చిన్నతనమున తమ తాతగారు పాండురంగవిజయములోనివని చెప్పుచు చాలపద్యములు చదివి వినిపించెడివారనియు, ఆ వినుకలి వలన తమకు వచ్చిన పద్యములలో ప్రస్తుత మొకటిమాత్రమే అసంపూర్ణముగా జ్ఞాపకమువచ్చుచున్నదనియు పూజ్యులు శ్రీ బి. రామరాజుగారు చెప్పుచున్నారు. ఆ పద్య మిది -

“మారామాజనకాంబుజాంబుజజరామారామ భూభృద్విరా
మారామార్త్య సరి త్కరిద్గణ విరామారామపోత్రిప్రియా
.....................................................
మారామాభయశస్కవిఠ్ఠలపురీక్ష్మాలోకరక్షామణీ!”

శ్రీ చాగంటి శేషయ్యగారు పాండురంగమాహాత్మమునే పాండురంగవిజయ మందురనియు, కొంద ఱీరెండుగ్రంథములును వేఱనిచెప్పు వాదము

  1. ఆంధ్రకవితరంగిణి, సం. 8. పుట. 11.
  2. పాండురంగమాహాత్మ్యము. శ్రీరాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారి ఉపోద్ఘాతము. పుట 28.
  3. వాఙ్మయవ్యాసమంజరి. పుట 116.