పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

టయే నిజము. పాండురంగవిజయకర్తృత్వము తెనాలి రామ(లింగ)కృష్ణునిదని ప్రాచీనులసాక్ష్యముండుట చేతను, అందలి పద్యములు నోటికి వచ్చినవారు పాతికముప్పది సంవత్సరముల క్రితమ వరకు ఈ తెణంగాణమున నున్నట్లు చూచి యెరిగిన సాహిత్యోపాసకులు వచించుట చేతను, ఇంకను దేశము నలుమూలలనుగల తాళపత్రగ్రంథముల సేకరణము జరుగ లేదు గనుకను, తెనాలి రామకృష్ణుడు పాండురంగవిజయప్రబంధమును రచించియుండుననుట కేవల మనృతము గాజాలదనియు, ముఖ్యముగా తెలంగాణము నందలి తాళపత్రగ్రంథసేకరణము సంపూర్ణముగా జరిగినప్పు డది లభింపవచ్చు ననియు విశ్వాసముతోనుండుటయే మంచిది. అంతవరకు పాండురంగవిజయ ప్రబంధములోనివి రెండుపద్యములు మనకున్నవనియే తృప్తి చెందవలయును. అసంపూర్ణముగా నున్న పద్య మింతకుముం దుదాహరింపబడినది. రెండవది సంపూర్ణముగా నున్నది. ఈ క్రింద నీయబడుచున్నది.[1]

సీ.

ప్రౌఢ దీర్ఘ సమాసపదములగూర్చి శ్రీ
        నాథుండు కూలార్చె నైషధంబు
దానితల్లిగ నల్లసాని పెద్దన చెప్పె
        ముది మదిదప్పి యాముక్తమాల్య
దూహించి తెలియరాకుండ సూరపరాజు
        భ్రమఁ గళాపూర్ణోదయము రచించె
నతిశ్లేష శబ్దవాగాడంబరంబొప్పఁ
        బస ఘటించెను మూర్తి వసుచరిత్ర
నిట్టికవులకు నేను వాకట్టుకొఱకు
చెప్పినాఁడ మదీయ వైచిత్రి మెఱయ
పాండురంగవిజయమును పటిమదనర
విష్ణువర్దిష్ణుఁ డగు రామకృష్ణకవిని.

పాండురంగవిజయము లోనిదని మనము దీనిని గ్రహించుచున్నాము గాని దీని వలన చాల చిక్కులున్నవి. అందువల్లనే బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు “రామకృష్ణకవి తన పాండురంగవిజయప్రబంధములోని కవిత్వపటుత్వమును గూర్చి చెప్పికొనినపద్యము" అని చెప్పుచునే "ఈ పద్యము

  1. చాటుపద్యరత్నాకరము. పుట. 47.