పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59


విష్ణు నామముతరువాత నారాయణ, భగనామములు వైదిక వాజ్మయమున విష్ణుపరములుగా కలవు 1[1] మరియు క్రమముగా వాసు దేవ-కృష్ణ శబ్దములును తత్పరములుగా వ్యాప్తికి వచ్చినది. ఆ వ్యాప్తినిబట్టియే వేదోపనిషత్పురా కేతిహాసముల మీదుగా సర్వాంగ సుందరమైన వైష్ణవము రూపు గట్టుకొన్నది.


క్రీస్తు పూర్వము నాల్గవ శతాబ్దమునాటికే వాసుదేవ - బలదేవులు పూజింపబడు చున్నటొక బౌద్ధుని వాక్య మున్నది.2 వాసు దేవుని విషయము పాణినికి తెలియును. కీస్తుపూర్వము వాసు దేవసంకర్షణ పూజా విధానమున్నట్లును ఆధారములున్నవి. ఆ కాలమునం దాపూజ చేయువారు భాగ వతు లవబడుచు) డెడి వారు. వారిది భాగవతమతము. ఆ వాసు దేవుడు వృషి వాసు దేవుడు. వానిని కేంద్రముగా చేసి చుట్టుకొన్న మతమునకు ఏకాంతిక ధర్మ మనియు పేరు. శ్రీమహావిష్ణువు నారదునకుప దేశించిన ధర్మమది. భగవద్ 2[2] లో అర్జునునకుపదేశించినదియు నీధర్మమే. పశువిశసనము లేని యజ్ఞ ధర్మమిది. ఈ ఏకాంతిక ధర్మమున వాసు దేవనామము ప్రముఖమైనది. పరమ సాత్విక మతమగుటను ఈ మఠము వారు సాత్వతు లనబడిరి. సత్వ ప్రాధాన్యము కల వారు వారు, అనన్యమైన భక్తి భావమున కేకాంత భావమని పేరు. పాంచరా త్రాగమసిద్ధాంతము ప్రసిద్ధికి వచ్చినపిదప ఏకాంతి. ధర్మము పొంచరాత ధర్మమైనది. ఈ విధముగా భాగవత-సాత్వత-ఏ కాంతి : -పాంచరాత నామముల బ్రశస్తమైన వైష్ణవము ఉత్తర దేశమునుండి దక్షిణ దేశమును ప్రవేశించినది3[3] . కాని దక్షిణ దేశముననే వైష్ణవము పుట్టినదనిపించిన మహానుభావులయిన వైష్ణప భక్తులు ఆళ్వారులు, వారు వైష్ణవవాజ్మయమును ద్రవిడ భాషను సృష్టించిరి వారివలన వైష్ణవముభక్తి మతముగా స్థిరపడినది. కాని శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్యుల వారి అద్వైత సిద్ధాంతదిప్తికి క్రమముగా భాగవతభక్తిమతము వెనుక బట్టినది 4 [4]అద్వైతమతము నెదుర్కొని

  1. 1. సర్వసిద్ధాంత సౌరభము. సంపుటము 7. పుటలు 37.52.
  2. 2. V. S. Vaisnavism Saivism (Sri R. G. Bhandarkar) Page 3.
  3. 3. సర్వసిద్దాంత సౌరభము. సంపుటము 7. పుట 110.
  4. 4. Vaisnavism went on till about the end of the eighth century. when the doctrine of spiritual monism and world-illusion was promulgated and disseminated by Sankaracharya and his followers. This was considered as destructive of the Bhakti, or love, which vaisnavism enjoined V. S. Page 100,