పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60


అలు వెనుకబట్టిన విష్ణుభక్తిని పునఃసంస్థాపించుటకే శ్రీమద్రామానుజు లవతరించిరి. 33. అ)దువల్లనే ఆళ్వార్లు చేయనిపనులు శ్రీభాష్యరచనాదికమును శ్రీమ ద్రామానుజులు చేయవలసివచ్చినది.


శ్రీమద్రామానుజుల అనుయాయిజనము దక్షిణ భారత దేశముననే ఎక్కువ ఈజనము వడగల - తెంగల అని రెండువర్గములగానున్నది. శ్రీమద్వేదాంత దేశికుల వారివల్లను , శ్రీమాన్ పిళ్ళై లోకాచార్యుల వారివల్లను వైష్ణవులలో నీతెగలేర్పడినవి.[1]1 ఇవి ఏర్పడినప్పటినుండియే వైష్ణవమున మతప్రచారము - అన్యులను తమమతములోనికి చేర్చుకొనుట ఇత్యాదులు మొదలైనవి రామకృష్ణున కొక వందసంవత్సరముల ముందునుండి వైష్ణవ మట్లయి యున్నది,

22. రామకృష్ణుని మధ్య వైష్ణవము :


మధ్యవచ్చిన రామకృష్ణుని వైష్ణవమునుగూర్చి చెప్పుట కధికారము గల శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు "ఘటికాచలమాహాత్మ్యమున వైష్ణనము కొంత ముదిరిన సూచనలున్నవి శ్రీవైష్ణవులమతము” కాని గ్రంధమును కొంత యున్నదనియు "పాండురంగమాహాత్మ్యములోనిది ఇంకను శిథిలమైన వైష్ణవము"2[2] - అని చెప్పియున్నారు. గ్రంథ రచనాక్రమమునుబట్టి శ్రీమాన్ శర్మగారి యర్థమును మనమిట్లు గ్రహింపవచ్చును.


రామకృష్ణుడు వైష్ణవముపుచ్చుకొని పేరు మార్చుకొన్నాడేగాని పూర్తిగా మనసు మార్చుకొన లేదు. ఆజన్మసిద్ధమైన శైవము నాతడుపూర్తిగా త్యజింప లేదు. అందువలననే ఆయన తాత్త్వికతయు అద్వైతమును సంపూర్ణముగా తొలగించుకొన్న విశిష్టాద్వైతము కాలేక పోయినది. ఈ విధముగా నున్న రామకృష్ణుని శిధిల వైష్ణ వబుద్ధి పాండురంగమహాత్మ్య రచనా కాలము నాడున్న దానికంటె ఘటికాచల మాహాత్మ్యమును రచించునాటికి మరికొంత శైథిల్యమును తగ్గించుకొని బిరుసెక్కి కొంత ముదురుపాకమున పడినది - అని ఈ అనంతకృష్ణ శర్మగారి యభిప్రాయము నిజము కావచ్చుననిపించు చున్నది. అపుడే రామలింగడు మతముతో పాటు పేరుమార్చుకొని రామ కృష్ణుడుగా నవతరించినాడన్న వాస్తవము మరియు సోపపత్తికమగును.

  1. 1. తెలుగు విజ్ఞాన సర్వస్వము సంపుటము 8. పుట 584. -
  2. 2. పాండు (సాహిత్య అకాడమి) ఉపోద్ఘాతము. పుటలు. 18, 17.