పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58


ర్యాత్మకుడు పాండురంగమహాత్మ్యమున సామిమలకు ప్రయాణముగట్టిన అగస్త్యమహర్షి మార్గ మధ్యమున మాల్యవంతాదికమును తన భార్యకు చూపి వర్ణించి చెప్పుట\ వంటిదే ఇచట ఘటికాచలమాహాత్మ్యములో వసిష్టుడు కాంచీనగరమును అరుంధతికి వర్ణించి చూపుట. నిగమశర్మవంటి వాడే హరిశర్మ. మరియు నుద్భటారాధ్య చరిత్రములోని మదాలసు డచ్చముగా నిగమశర్మను మించిన వాడు.


మిగిలిన పోలికలుకొన్ని ఝడి తిస్పూర్తికలవి " పద్యరచనాదికము.-3" “ఛందోవి శేషములు_4" .అని అనుబంధమున చూపబడినవి సూక్ష్మముగా విచారించుచో మరికొన్ని తోచగలవు.


IV

21. వైష్ణవము పుట్టుపూర్వోత్తరములు :


విష్ణువునకు సంబంధించినది వైష్ణవము విష్ణువును పరదైవముగా భావించి భక్తి భావముతో నారాధించువిధము వైష్ణవము. అది హిందూమతమున నొక అవాంతరశాఖ.


విష్ణుశబ్దము నామవాచకముగాగూడ వేద వాజ్మయమున నుపయోగింప బడినది. ఋగ్వేదము , విష్ణువు ప్రస్తుతి యున్నది. 1[1] విష్ణు వుయొక్క అవతార కథలకుకూడ బీజములందున్నవి. కాని ఆ కాలమున విష్ణువుసర్వాధికుడుకాడు ఇంద్రుని ముఖ్యమిత్రులలో నొకడు.


శతపథ బ్రాహ్మణమున 2[2] విష్ణువు యజ్ఞముగా ప్రస్తావింపబడినాడు. యజ్ఞ ముఖమున నే దేవతలు పృధ్వాదులను వశీకరించుకొనిరి. యజ్లరక్షకుడుగా గూడ చెప్ప బడి నాడు. ప్రజాపతికంటే ముందే నామరూపములచేత స్థిరపరుపబడిన దైవము విష్ణువు ఈ దైవతముయొక్క ప్రాదుర్భావము విషయము మాత్రము చెప్పబడలేదు. యజ్ల సంబంధమే ఎక్కువ చెప్పబడి యున్నది. యజ్ఞముయొక్క పూర్వార్థము అగ్ని, ఉత్తరార్థము విష్ణువు ఆనియు దేవతలయందున్నతుడనియు కూడ ఆ బ్రాహ్మణము నందున్నది.

  1. 1. సర్వసిద్ధాంత సౌరభము. (అనుభవానంద స్వాముల వారు) సంపుటము 7 పుట 34-36.
  2. 2. (R. M.) Religion and Mythology of the Brahmanas (Dr. G. V. Devasthali) pages 8.9.26. 167.