పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ఘటికాచలమాహాత్మ్యము


జామదగ్నుండవై త్రుంచి శోధించి తజవంశావళిం గిన్క
ముయ్యేడుమాఱుల్ కుఠారాగ్రహేతిన్ రణిక్షోణహింసించి తద్రక్త
ధారావళిన్ సప్తహ్రదంబుల్ ముదంబొప్పఁగావించి వాటన్
బితౄణం బొగిం దీర్పవా [1]భూభరం బార్పవా పంక్తికంఠుం డకుంఠ
ప్రతాపంబునన్ వాసవాద్యష్ట[2]దిక్పాలురన్ సిద్దసాధ్యాప్సరోయక్ష
గంధర్వవిద్యాధరశ్రేణులం బట్టి బాధింప వానిన్ విదారింప ధాత్రిన్
దశస్యందనక్షోణిపాలాత్మజాతుండవై రామనామంబునం బుట్టి
సీతాసతిం బెండ్లియై తండ్రియాజ్ఞప్తి నీరేడుసంవత్సరంబుల్ మహా
రణ్యవాసంబు గావించి సీతాపహారున్ మహావీరు లంకాపురీవాసు
వీతాత్మసంత్రాసు లోకైకవిద్రావణున్ రావణున్ భండనక్షోణిలో
ద్రుంచి సీతాసమేతంబుగా రాజ్యముం జెందవా సర్వలోకస్తుతుల్
బొందవా ధాత్రిఁ గృష్ణాగ్రజాతుండవై [3]రోహిణేయుండవై బుట్టి లీలం
బలంబాదిదుష్టాసురశ్రేణి ఖండింపవా దిక్కులంవగీర్తిలనిండింపవా
త్రైపురేంద్రద్విడాయుర్వి నాశార్థమై బుద్ధరూపంబునన్ దద్వధూ
శీలభంగంబు [4]భావింపవా మోహనానేకశాస్త్రప్రసంగంబుఁ గావిం
పవా మీఁదటన్ గల్కిరూపంబునన్ మ్లేచ్ఛులన్ మట్టనున్నట్టి మీ
దివ్యలీలల్ ప్రశంసింతు మీశా విధీశా చిత్తుదుష్ప్రాపమౌ నీదు
రూపంబుఁ గన్గొంటి మస్మత్తపంబుల్ ఫలించెన్ నిరీశా రమాధీశ
సర్వేశ్వరా నిర్వికల్పా నిరీహా పరానందసంవిత్స్వరూపా నృసింహా
నమస్తే నమస్తే నమః.

253


ఆశ్వాసాంతము

మ.

సతతానేక విపశ్చిదీడిత కళాజాతామ్ర తామ్రాక్షశో
భిత దేహశ్రమనందితైకఖురళీభేతాళ[5]తాళోద్భట
స్తుతిపాత్రీకృతసార సారగుణయాదోరాశి [6]దోరాసితా
సీతధారాసితమండనాగ్రనిహతాశేషాహి[7]రాణ్మండలా.

254


పంచచామరము.

మరాళ రాజి రాజితక్షమా ధరేంద్ర చంద్రికా
నరాళ గాంగ తుంగ భంగ నవ్య నవ్యయప్రభా

  1. భూధరం. తా.
  2. దిక్పాలకుల్. తా.
  3. రాహణేయుండవై. తా.
  4. గాలింపవా. పూ. ము.
  5. తాళధ్వట. తా.
  6. దోరాశిరాశితధారాశిత. తా.
  7. రాఙ్మండలా. తా.