పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

103


దండకము:

శ్రీనృసింహా సురారాత్యహంకారరంహా ప్రమత్తేభ
సింహా నిరంహస్తమస్సాధు సంకీర్తితాహ్వా, ద్విజిహ్వాదిరాడ్భూ
షణా బ్రహ్మముఖ్యామరాధీశకోటీరకోటిస్ఫురద్రత్నకోటీవినూత్న
ప్రభా భాసమానాంఘ్రి రాజీవ రాజీవగర్భాండ భాండచ్ఛటా
సృష్టిరక్షావినాశక్రియాదక్ష దక్షాధ్వరధ్వంసిచేతః[1]ప్రమోదాతి
నిష్ణాతవేషా అశేషాజరానీకదుర్లోకదంష్ట్రాస్యజిహ్మా నఖాగ్రక్షణోద
గ్రజాగ్రన్మహావిగ్రప్రగ్రహా గ్రాహరూపోగ్ర సంసార బంధచ్ఛి
దాచుంచుచంచల్లవిత్రా పవిత్రాకృతీ స్వామి నీదివ్య లీలా నికా
యంబు లాత్మన్వివేకింపగా నప్రమేయంబు లశ్రాంతయోగీంద్ర
హృద్గేయముల్ శక్రశంభుస్వయంభూమనోజ్ఞేయముల్ భవ్యదివ్యర్షి
వాగ్గేయముల్ క్షీరవారాశికన్యాజనుర్భాగధేయంబు లవ్వాని
నేమున్ నుతింపన్ ప్రవర్తింపు టోహో మహాసాహసిక్యంబు దేవో
త్తమా సోమకాఖ్యుండు దైతేయముఖ్యుండు వాణీవధూనాథు
వంచించి ప్రామిన్కులెల్లన్ [2]బ్రమోషించి మున్నీటిపెన్నీటిలో
డాగ వానిన్ మహామత్స్యరూపంబునన్ బుట్టి వారాశిలోఁ బట్టి
పుచ్ఛంబునన్ గొట్టి యా వేదముల్ దెచ్చి యావేధకున్ బ్రీతితో
నిచ్చి హెచ్చునా గటాక్షింపవా వైదికాచారమార్గంబు రక్షింపవా
దేవతల్ దేవతారుల్ సుధోత్పాదనార్థంబుగా మందరాగమ్మునన్
వారిరాశిన్ మధించంగ నప్పర్వతంబబ్ధిలో గ్రుంగినన్ దానిఁ
గూర్మావతారంబునుం దాల్చి పైకెత్తవా కీర్తులన్ హత్తవా పాప
బుద్ధిన్ హిరణ్యాక్షు డిద్ధారుణిన్ జాపగాజుట్టి పాతాళలోకం
బునన్ బెట్ట దానిన్ వరాహావతారంబునన్ మీఱి దంష్ట్రాగ్రభాగంబుచే
నుబ్బగా నెత్తవా సర్వమున్ విష్ణుఁడేయంచు భాషించు ప్రహ్లా
దుపైఁ గిన్క వాటించి యిచ్చోట నీ వాహరింజూపుమంచున్ హిర
ణ్యాక్ష దైత్యానుజుం డుక్కుకంబంబు దాచేతఁ దాటింప పాటించి
యందే నృసింహావతారంబునన్ బొల్చి ఘోరార్భటిన్ నిల్చి యాదై
త్యునిన్ ద్రుంచవా బాలు ప్రహ్లాదు రక్షించి విఖ్యాతిచే మించవా
వామనబ్రహ్మచర్యాకృతిన్ [3]బూని నీ వా బలిం జేరి యాదైత్యుచేఁ
గోరి పాదత్రయీమాత్రభూదానముం బట్టి త్రైవిక్రమాకారముం
బూని మింటన్ ధరిత్రిన్ పదద్వంద్వమున్ నించి శిష్టేకపాదంబు
తన్మూర్థభాగంబుపై నుంచి యద్దైత్యుఁ బాతాళముం జేర్పవా వజ్రకిన్
గోర్కె చేకూర్చవా తండ్రికింగీడు వాటించునక్కార్తవీర్యార్జునున్

  1. ప్రమోషాతి. తా.
  2. ప్రఘోషించి. తా.
  3. మీరిచాతన్. తా.