పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

105


ధురా లసత్వ కారి కాంతి ధుర్య కీర్తి కీర్తి తా
కరాళ విద్విషన్నికాయగర్వశార్వ[1]రారుణా.

255


[2]మాలిని.

సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటేజా!
పరభటకృతపూజా! బంధుగీర్వాణభూజా!
తరుణతరణితేజా! ధారుణీరాజరాజా!
భరణసుకవిభోజా! భాగమాంబాతనూజా!

256


గద్య. ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత
సరస కవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన
ఘటికాచల[3]మాహాత్మ్యంబను మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.

  1. శర్వరారుణా తా.
  2. తాళపత్రప్రతియం దీపద్య మిచట లేదు. ప్రథమ తృతీయాశ్వాసాంతములం దున్నది. రెండుచోట్లగల పద్యము మూడవచోటగూడ నున్నచో అదొక నిండని యుంచబడినది.
  3. మహత్వంబను. తా.