పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

ఘటికాచలమాహాత్మ్యము


చ.

అనవుడు వార లిట్టులని రాదరమొప్ప మహర్షులార! మీ
రనినగతిం ద్రివర్గముల నాస యొకింతయు లేదు ముక్తికై
వనజదళాక్షు గాంచుటకు వాంఛితమొక్కడుదక్క దానిపై
ఘనతపమాచరించుటకు కారణమున్నది చిత్తగింపుడా!

240


సీ.

[1]మునులార [2]దివిపైన మునుపందరమును మా
పతి [3]గుఱియించి తపంబు సల్ప
నాకాశభారతి యచటఁ బ్రసన్నయై
హితభాషణముల మాకిట్టులనియె
వినుఁడిందు మునులార! విష్ణుసాక్షాత్కార
మతిదుర్లభంబు ప్రయాససాధ్య
[4]మటుగాన యవనిపై ఘటికాచలము గల
దందు వే ప్రత్యక్షమగును శౌరి
కృతయుగమ్మున సప్తర్షు లతులకీర్తు
లందుఁ దపమున హరిఁ గాంతు రట్టియెడలఁ
గందురు ముకుందు నందుల కరుగుఁ డనిన
నాటగోలెను వచ్చియున్నార మిచట.

241


క.

అన విని యాసప్తర్షులు
మనమున నశరీరవాణిమాటలవలనన్
వనజాక్షుఁ గనుట నిజమని
యనుపమసంతోషభరము నందుచు నచటన్.

242


వ.[5]

ఫలతీర్థాహ్వయ సరోవరవారిఁ గృతస్నానులయి నిత్యకృత్యంబు లాచరించి.

243


శా.

వారంతన్ ఘటికాచలేశ్వరు జగత్స్వామిన్ దయాసారగం
భీరాకారు నుదారుని న్నిజమనఃపీఠంబున న్నిల్పి దు

  1. మును లెల్ల. పూ.ము. తా.
  2. దీనిపై. పూ. ము. దివిపై . తా.
  3. గురిచి. తా.
  4. మట తా.
  5. ఈ వచనము తాళపత్రప్రతిలో కొట్టివేయబడియున్నది. మరియు నందు “నిత్యకృత్యంబు లాచరించి" అన్నది లేదు.