పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

99


నర్కరథమున కొనర మధ్యాహ్నవేళ
గతి విలంబంబు గావించు కరణిదాని.

235


సీ.

నెత్తంబులందు మానికముల కలిమిచే
మేరు [1]మహీధ్రమ్ము దూరుచేసి
రహిమించు పటికంపు రాగుంపు సొంపున
కైలాసకుధరమ్ము కాకుచేసి
నెలరాతి[2]చాలుపు వలి[3]నీటిజాలున
హిమవన్నగేంద్రమ్ము నీసడించి
సిగరమ్ములను నిగనిగబంగరువునను
హేమకూటనదంబు నెగ్గులెన్ని
సురభి[4]చందనశాఖి సంశోభి యగుట
మలయధరణిధరేంద్రమ్ముఁ జులకఁ జేసి
బహుతరంబైన చామరప్రతతి కలిమి
నొలసి నగరాజభావమ్ముఁ దెలుపుదాని.

238


క.

[5]పటికాక్షసరముఁ జేకొని
ఘటికామాత్రము జపింప మనమగు సిద్ధుల్
ఘటియింపఁజేయు దానిన్
[6]ఘటికాద్రిని నచలభక్తిఁ గనుగొని యచటన్.

237


మ.

ఫలతీర్ధాహ్వయ తత్సరోవరతటప్రాంతంబున న్నిల్చి ని
శ్చలవృత్తిం దపమాచరించుమునులన్ సాధుక్రియంగాంచి వా
రలు దర్భాసన వంద నార్చన లొనర్పన్ బ్రేమఁగైకొంచు ను
జ్జ్వలవాక్ప్రౌఢిమఁ బల్కిరిట్టులని వాత్సల్యంబు దీపింపగన్.

238


చ.

అనిశము నర్థకామములయందు విరక్తతఁ దెల్పెడున్ భవ
ద్ఘనతరచిత్తశాంతి మరిధర్మము మీ రెటనుందురందు మీ
మనముననుండు మోక్షదుఁడు మాధవు డింకఁ దపఃప్రవృత్తి కై
మొనసినకోర్కి యేది మది మోదముతో నది మాకుఁ దెల్పుఁడా!

239
  1. మహీంద్రమ్ము. తా.
  2. చాలిపెన్. పూ. ము. తా.
  3. నిండు. పూ. ము.
  4. నందన పూ. ము.
  5. స్ఫటికా. పూ. ము.
  6. ఘటికాచలమచలభక్తి. పూ. ము. తా.