పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

ఘటికాచలమాహాత్మ్యము


మహాస్రగ్ధర.

ఘటికామాత్రోపసేవాకలన
జనులకుం గాంక్షితార్థంబు లిందే
ఘటియించున్ ప్రాగ్భవీయోత్కట
కుటిల మహాకల్మషంబుల్దొలంగున్
స్ఫుటరీతిన్ దీనిభాతిన్
బొలుచునె మఱి యీభూమి నెందేనియం చు
త్కట[1]రీతిన్ దెల్పు జాడందగు
శిఖిరవముల్ గల్గి రాజిల్లుదానిన్.

232


క.

మృగపతులౌటను [2]నొరయన్
బగలు నిసర్గజములై నపగలెఱుఁగకయే
మృగములఁ బరిపాలింపుచు
నెగడెడు సింగములగముల నెరవగు దానిన్.

233


సీ.

నెత్తంపు రతనాల నిగ్గు లగ్గలికల
జాళువా గుబ్బలిఁ బోలుదాని
హరిపద సంభూత సరిదంబు సంగతి
నాకలోకప్రౌఢి నవ్వుదాని
అమిత ధాతుప్రత్యయాగ[3]మానితమౌట
శబ్దశాస్త్ర ప్రతిచ్ఛాయదాని
సరముల సతతప్రసర దూర్మికా కంక
ణాసక్తి నృపలీల నమరుదాని
కలిత భృగు జటీ శాండిల్య గాలవాది
యుక్తి ఋష్యాశ్రమమువలెనుండుదాని
తృప్త మృగ పక్షి సంఘాత [4]దీర్ఘఘోష
ణ ప్రవర్తన వనరీతి నగెడుదాని.

234


గీ.

ప్రాంశు శిఖర మయూర[5]దృక్ స్రంసమాన
భుజగ పాశంబు లరుణుండు పొసఁగఁ గూర్ప

  1. కీర్తిం. పూ. ము.
  2. మెరయున్. పూ. ము.
  3. షూన్విత. తా.
  4. దిర. తా.
  5. దృత్సంసమాన. తా.