పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

101


ర్వారంబౌ విషయైక[1]భోగనిరతస్వాంతంబు బంధించి తా
రారాధించిరి వేద[2]చోదితమను ధ్యానప్రకారంబునన్.

244


క.

హరి సర్వజీవహృదయాం
తరగతి సర్వజ్ఞుఁ డయ్యుఁ దన్మునిచిత్త
స్థిరతఁ గనన్ క్రీడాత
త్పరుఁడై కించిద్విలంబపరుఁడై యుండన్.

245


ఉ.

వారలు శౌరిఁగానమికివందురుచున్ దురపిల్లి యక్కటా
శ్రీరమణీమనోహరుఁ డశేషజనావనతత్పరుండు మా
కోరిక యియ్యఁడయ్యె ప్రతికూలతఁ జెందె మదీయభాగ్యముల్
నారద వాయునందన సనందన ముఖ్యులఁ బోలమింతయున్.

246


చ.

యమముఖ పూర్వయోగనిచయమ్మున సుస్థిర మేమహాత్ముచి
త్త మతఁడుదక్క నన్యులకుఁదప్పుఁదలంపు ప్రమాదయుక్తిఁదా
లిమిపసలేమిఁ గష్టపడలేమి శుచిత్వములేమి మానస
భ్రమ నలసత్వసంగతి నభక్తి నశక్తిని నమ్మకుండుటన్.

247


క.

అని యీగతి తమ యోగ
మ్మున కెడనెడ నంతరాయములు దెల్పుచు నం
త నితాంతనిశ్చలంబై
తనరు తపంబాచరింప తాత్పర్యమునన్.

248


వ.

తదవసరమ్మునం బిచండిల మార్తాండమండలాఖండదీప్తిఛ్ఛటానిరా
సక బ్రహ్మాండకటాహ [3]పాటన ప్రశస్త చిరత్నరత్నప్రభా భాసుర
కోటీరుండును, కోటీరమ్మద మదవిదారక పిశంగలోచన త్రితయాం
చల ప్రోచ్చలద్విస్ఫులింగసముదయుండును, సముదయత్ప్రభావిభా
సమానరత్నమంజీర కంకణ కేయూర హార కుండల ప్రముఖ
విభూషణవితానుండును, వితానధ్వంసరిరంసాక్షుద్ర వీరభద్రరౌద్ర
రసవిద్రావణ సమున్నిద్రకరాళదంష్ట్రాయుగళుండును, గళవినిర్గత
కహకహోత్తర్జనగర్జారవప్రవిదారిత దానవహృదయవిసరుండును,

  1. భోగి. తా.
  2. మోదిత. పూ. ము.
  3. పాటవ. పూ. ము.