పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఘటికాచలమాహాత్మ్యము


పైపై గుబాళించు మైపూత భుగభుగల్
పల్లవాలికి మరుల్ [1]బలిమి గూర్ప
ఇంచువిల్తుని నీసడించు వీక్షణ రుచుల్
ప్రజల పాయఁగ బరాబరు లొనర్ప
కావిచక్కెరమోవి కమ్మకస్తురితావి
యువజనమ్ములకు నోరూరఁజేయ
దండలు వహింప విటులకైదండ లూని
సమదగతి పెంపు మందహాసముల సొంపు
వెలయ విహరించు నివ్వీట లలిత రూప
భాజనమ్మగు వారనారీజనంబు.

217


సీ.

కరుడుబారెడు వీటికారసమ్ముల కావి
మోవికాటులకు మేల్ముసుఁగులొసఁగ
మినుకుగుబ్బలనింపుమీఱు క్రొన్నెలబారు
చిటులుగందము నిండుసిగ్గు నిలుప
తెలిగన్నుదమ్ములదేరు నిద్దురమంపు
[2]నడరు నెమ్మది భయంబావరింప
పతుల ప్రేముడి జూడ బదరు వెల్వెలబాటు
తెచ్చుకోలగుతెల్వి తెరయొనర్ప
మగలకునుమాటి మదిలేని మరులుచాటి
మగువకవగూడు నొకపాటి మరుని ధాటి
వెరపువోమీటి వేగుచో వీటి మేటి
జారిణీకోటి చతురతాస్వర్ణపేటి.

218


ఉ.

తేలెడికన్నుల న్నిదురదేల బుగుల్కొనుతావిపూలకై
వ్రాలిన కొప్పులంసములవ్రాలఁ జనుంగవ భారకంబునం
దూలు వలగ్నముల్ బెళుకు తూలకణమ్ములఁబోల నీవి కెం
గేలికిఁ [3]దార్చి [4]వెళ్ళుదురు కేళిగృహంబులు వారకామినుల్.

218
  1. బవిలి దీర్ప. తా. బలిమిఁ జేర్ప. పూ. ము.
  2. నడగు. తా. నడ నెరద భయ మావరింప. పూ. ము.
  3. వార్చి. తా.
  4. వెల్వడిరి. తా. పూ. ము.