పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

95


క.

సంతానధరిత్రీరుహ
సంతాన[1]సమావనీజ సంతానవరా
శ్రాంత వసంతవిలాసా
క్రాంతములై యుపవనములు రాజిలు మిగులన్.

220


లయగ్రాహి.

ఇప్పురము నందునికి నెప్పుడును [2]తెమ్మెరలు
విప్పుగల తోపులను గప్పురపుటంటుల్
తెప్పలుగఁ గూర్చు తెలికప్పురఁపు వాసనలఁ
దప్పక హరించి యల చొప్పణఁచ వేడ్కల్
గప్ప రతి దేలి శ్రమమప్పుడు వహించి నెఱిఁ
దప్పు సుమగంధులకు నప్పరిమళంబుల్
దెప్పరము గా[3]నొసఁగి చిప్పిలుచు వారి మెయి
నొప్పు పెరతావి ప్రియముప్పతిలఁ [4]బూనున్.

221


సీ.

ఈవిరుల్ వెతకి యి మ్మెలనాగ కలయంగ
నీవిరుల్ వెదకిన నిపుడుగలవె
యీసరుల్ బూనిననింత వింతయియుండు
నీసరుల్ దెలుపంగ యెలమి గలదె
యీవిర వాదుల కేపుజూపెద వేలె
.............................
..............................
.............................
[5]ననుచు కందువ మాటల నొనర నిటుల
విటుల జటులప్రవీణత వెలయఁ బలికి
ఠీవులలరంగ తావుల తావులైన
పూవు లమ్ముదు [6]రివ్వీట పువ్వుబోండ్లు.

222
  1. సమూహభూజ. పూ. ము.
  2. తుమ్మెదలు. పూ. ము . తా.
  3. నెసఁగి పూ. ము.
  4. బూనన్. పూ. ము. తా.
  5. యీ యలరుల కొమ్మ యేలవచ్చు ఇది యెత్తుగీతి పైపాదముగా
    పూర్వముద్రణమున కలదు. తాళపత్రమునను కలదు.
  6. రిమ్ముగ