పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

93


చ.

హరిపదసేవఁ జెంది విబుధాశ్రయ విశ్రుత జీవనస్థితిన్
దిరమయి నిర్మలాశయ మనిందతమై తనరార సత్కవీ
శ్వరనుతమైనవాహిని యజస్రము లోకములెల్ల నిండ సో
దరియగు గంగతో దొరయు [1]తా పురి నాలవజాతి యెంతయున్.

218


క.

ఒదుగుచు [2]నొక్కొక మూలను
జదికిలఁబడి కదలమెదలఁజాలవు తామే
మదకరులని దిక్కరులన్
మదిరోయుఁ బురంబులోని మదనాగంబుల్.

214


మ.

అరుదా భారవహంపుజీవనము నాహాయంచు నిట్లున్న ది
క్కరులంచున్ గిరులెంచునంచు బుధలోకంబంచు నూహించ ను
ద్ధురతన్ భూమిఁ బెకల్చి తాల్చుటకు నుద్యోగించు చందంబునన్
దరులొక్కుమ్మడిఁ గ్రుమ్ముఁ [3]గొమ్ములను మాద్యద్ధంతి సంతానముల్.

215


సీ.

అహిభయాపాదకంబై నిజేచ్ఛఁ జరించు
నంబుజోదరు తురగంబుఁ దెగడి
అలఘువద క్రమములమీఱి తనరారు
కందర్పహరు ఘోటకముల నవ్వి
మొనసిన పరపక్షులల[4]ను చేరివర్తిల్లు
నలినజు కంఖాణముల హసించి
ఆశుగప్రతతిరా నళికి దిక్కులఁబాఱు
నమరవల్లభు వాహనముల గేరి
తనరు నవిశంబు సాదిచేతః ప్రమోద
కర నిరాఘాట వేగబంధుర విశిష్ట
గుణగణభ్రాజితోద్దండ రణనిరంకు
శమ్ములై యొప్పు నివ్వీటి సైంధవములు.

216


సీ.

ఘణిఘణిల్లని పాద కటక నిక్వణనముల్
వ్రతుల ధైర్యము వకావక లొనర్ప

  1. నీపురి. పూ. ము. తా.
  2. నొక్కొక్కమూలల. తా. నొక్కటమూలల. పూ. ము.
  3. తత్పురి సముద్యద్ధంతి. తా.
  4. నె. తా.