పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఘటికాచలమాహాత్మ్యము


గీ.

తడి వలిపె చంద్రకావిపావడలు వైచి
యొండొరు నితంబబింబ కుచోరు నఖము
ఖాంకములు జూచి చిరునగవంకురింపఁ
జలువలును రత్నభూషణములును బూని.

137


క.

పువ్వులు పూతలు గైకొని
యవ్వల యౌవనజ భావ [1]హావములలరన్
జవ్వనులు [2]మెలఁగ నత్తరి
[3]మువ్వన్నియవేల్పు చరమభూదర మెక్కెన్.

138


గీ.

మొదల బూర్వాశఁ జెందితి పిదప [4]పద్మి
నికిని కరములు సాచితి విఁకను దొలఁగు
మనియ పూర్వాశకాలఁ దాచినఁ దదంఘ్రి
యావమన రాగ మిగురొత్తె నర్కుమేన.

139


మ.

ఇనుఁ డత్యుత్కటతేజుఁడై మెలఁగి [5]భూయిష్ఠానురాగంబునం
దనుఁ జేరంజనుదేరఁగా నపరదిక్తన్వీశిరోరత్న మె
త్తిన నీరాజనమో యనం దదనుషక్తింబుట్టు[6]రాగమ్ము త
త్కనదాశాసతిమేన బల్విరిసెనాఁ గన్పట్టె సాంధ్యద్యుతుల్.

140


సీ.

ఉదయించినది మొదల్ మది మోద మలవడ
కల వసూత్కరము సానులనుఁ జేర్చె
ద్విజరాజమండల తేజంబు మాయించి
కువలయవృద్ధి తక్కువగఁ జేసె
గురుతరస్తోమవిస్ఫురణంబు సందుగొం
దుల నిగూఢక్రియ నిల నొనర్చె
పుణ్యజనస్తోమములపెంపు దూలించి
పద్మినీసతిఁబట్టి పగలు గూడె

  1. హారము. తా.
  2. మెలఁగిరత్తరి. పూ. ము.
  3. పువ్వన్నియ. తా.
  4. పద్మినికి. తా.
  5. భూజిష్ఠా. తా.
  6. గారమ్ముతత్ననవాశా. తా.