పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

75


ప్రబలనుగ్రప్రభుత తుదిరంగ మడర
నంటె [1]ధారుణినని తను నఖిలజనము
తూలనాడెడునిందకుఁజాల కపర
వారిధినిబడెనన గ్రుంకె వనజహితుఁడు.

141


గీ.

[2]అస్తగిరిశిఖరాహతిధ్వస్త రవిర
థాక్షనవపాతి శకటాంజనౌఘమనఁగ
తుముల మదనప్రతాపాగ్ని ధూమమనఁగ
నంధకారంబు జగమెల్ల నాక్రమించె.

142


చ.

జగముల నేకకాలమున శంబరవైరి జయింపఁబంచినన్
నిగిడిన నల్లమూకయని నింగియు నేల యనంతరూఢికై
మొగి బెనగంగఁ జేరెనన బుట్టిన యిండ్లను జూడ భూమికై
డిగఁబడు కార్మొగిళ్ళనఁగ ఠీవి దలిర్కొనె చిమ్మచీకటుల్.

143


గీ.

జలజవనినుండి తుమ్మెద వలసవోయెఁ
గువలయ వనీదళాంతర గుహలు సేర
బల్లిదుండయి చీకఁటి కొల్ల[3]కాడు
వక్రవిక్రమగతి దిశలాక్రమింప.

144


చ.

సమయవణిగ్వరుం డతులసాంధ్యవిభారుణ కంజరాగ ర
త్నము లెడలించి నీలి నునుదట్టపు టొల్లియ మీద చాలుగా
నమరిచినట్టి చొక్కటపుటాణిమెఱుంగుల[4]మొత్తముల్ బలెన్
గ్రమముగఁ దోచెఁ దారక లఖండరుచిన్ గగనాంగణంబునన్.

145


క.

ఆకాశమండల[5]మధుమ
ధూకానోకహమునందుఁ దులకించు సుమా
నీకముజోకం [6]దగి య
స్తోకప్రభ కడల నిక్కఁజుక్కలు దోచెను.

146
  1. వారుణి. తా.
  2. హస్త. తా.
  3. కాని. తా. కాడ పూ. ము.
  4. ముత్తెముల్ వలెన్ గ్రమమున. తా.
  5. మన. పూ. ము.
  6. దని. తా.