పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

73


గీ.

రమణియొక్కతె కడునిబ్బరమున నీద
నిగ్గుదేరెడి చిన్నారి నెమ్మొగమ్ము
వేణి రాణించె జాబిల్లి వెఱచి కునుక
కినుక వెనుకొను సింహికాతనయు కరణి.

131


క.

తను బట్టలేని చెలులం
గని నవ్వుచు నోలయిడుచు కలికి యొకతె యీ
దెను గొలకంతయు నరుదా
[1]స్తనకుంభప్లవము [2]లండ సంపాదింపన్.

132


మ.

తరుణీరత్న మొకర్తు వెల్లికిల నీదన్ గుబ్బచన్బిందియల్
గరమొప్పెం దమయామినీగతవియోగగ్లాని వారింపఁగా
వెర వూహించి [3]ముఖాబ్జుఁగాంచి భజనావృత్తిం బ్రవర్తింపుచున్
వరముం జెందగఁ [4]2జేరు జక్కవలు నవ్యస్పూర్తి శోభిల్లగన్.

133


గీ.

నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు
మోముమాత్రము గానరా మోహనాంగి
యొకతె నిలువీతలీదఁ జెన్నొందె కురులు
తమ్మి గ్రమ్ముక విడని భృంగమ్ములనఁగ.

134


క.

కలుకుం గుబ్బల గందము
గళముల కుంకుమము నుదుటి కస్తురి నెమ్మే
నుల పసపు సరోలక్ష్మికి
వెలువుగ నీరాడి సహజశృంగారముగన్.

135


గీ.

కొలను వెలువడుచోఁ దమ గోవమోము
తమ్మితావులుగొన మరందమ్ము వెడలఁ
గ్రాయు తుమ్మెదలనఁగఁ గంకణములీను
కీలు[5]గంటులు చెలఁగ నవ్వాలుగంట్లు.

136
  1. స్తనకుంభము (లురమునందు సంపాదింపాన్) అని పూర్వముద్రణమున నీపాదము పూరింపబడియున్నది.
  2. లుండు. తా.
  3. ముఖంబు పూ. ము.
  4. జేయ జిరవల. తా.
  5. గండ్లు చెంగల్వ నవ్వాలుగండ్లు. తా.