పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71


కరకంకణమ్ములు [1]మొరయఁ బదముల వ్రే
ల్చిటికలు దీసి మచ్చికలు జేసి
కళల యిక్కువలంటి గళముల సందిళ్ళ
క్రొవ్వాడి నులివంక గోరులుంచి
యెంత గరగించి[2]నను నొకయింతయైనఁ
జలనమందక రాఁబ్రతిమలును బోలె
నలరు జడదార్లగని లజ్జఁజెలులు తలలు
వాంచి తమనేర్పులెల్లఁ జాలించి యలసి.

120


క.

[3]నడిమింటి తపసి డెందపు
[4]నడిమింటం జెలగు [5]దమ్మినంటు వెలుంగున్
గడుదారి యాతపములన్
జడదారుల యా తపముల జడసి యలంతన్.

121


క.

నీవు లొకించుక వీడన్
మోవులు వసివాడ నూరువులు తట్టాడన్
పూవిలుతుఁ [6]డెక్కి విడిచిన
[7]మావులునా వచ్చు చెలుల మానస మలరన్.[8]

122


గీ.

తరుణలతికా పరీరంభ తత్పరుండు
కైరవిణికాబ్జినీపుష్పగంధరతుఁడు
మధుకరీగానసంయుక్తమానసుండు
మలయపవమానుఁ డెదురుగా మలయుటయును.

123


క.

 ఎదురెదురుగఁ జని చూచిరి
మదవతు లరవిందబృంద మకరంద రసో
న్మద చంచరీక కేళీ
సదనంబై యొప్పు నొక్క జలజాకరమున్.

124
  1. మెరయ తా.
  2. నా యొక. తా.
  3. నడిమింట. తా.
  4. నడిమింటిం జెలసి. పూ. ము.
  5. ఈ కడమభాగము పూ. ము. న లేదు.
  6. తమ్మి విడిచిన తా
  7. మడువులు.
  8. ఈ పద్యము పూర్వార్ధము పూ. ము. న లేదు.
    121, 122 పద్యములు రెండును ఒక పద్యముగా ఆసమగ్రచిహ్నములతో పూ.ము. న కలవు.