పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ఘటికాచలమాహాత్మ్యము


బగ్గలిక పలుకు వలుకుట
సిగ్గులచేటయ్యె నేమి సేయుద మింకన్.

116


క.

అమరులు వినఁగా మనమా
యమరేంద్రుని సమ్ముఖమున ననుమాటలు నే
డమరక పోయెగదా యని
యమరసతులు మంతనంబు లాడుచు వ్రీడన్.

117


సీ.

తేఁటిపాటలు దిద్దు తెఱుఁగున నటపాట
పాటగా నీటుగా పాటపాడి
[1]యెలయించి పరభృతమ్ములఁ బిల్చు చెల్వున
పలుకుల తేనియల్ దొలక వలికి
[2]అంచల గడు [3]నుడికించు చందంబున
నడల యొయ్యారంపు నటన చూపి
కేకి సంఘంబు జంకించు చందంబున
గిలకొట్టి బెట్టుగా కేక వేసి
అలరు తేనియ కరయంత్రములను జిమ్మి
యెమ్మె మీఱఁగ దీఁగ యుయ్యెలల నూగి
పూవు బంతులు చెంతలఁబోవ మీటి
తావి పుప్పొడినీ ర్వసంతంబులాడి.

118


గీ.

భావ హేలానుభావ విభ్రమ విలాస
లలిత బిబ్బోక విభ్రమాదులను బేరు
గల యలంకారములను శృంగారకలన
వెలయఁగా మీటి మఱి చొరవలకుఁ జేరి.

119


సీ.

గుబ్బకుమ్ముల నెదల్ గుమ్మెలువోఁ గుమ్మి
గట్టిగా బిగియారఁ గౌగిలించి
కపురంపు వీడెంపు గంధంబు గుబులుకో
వేమారు చెవుల నేమేమొ గొణిగి

  1. యలయించి పూ. ము. తా.
  2. యచ్చట కడు నడకించు. తా.
  3. నడకించు పూ. ము.