పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఘటికాచలమాహాత్మ్యము


మువ్వంక మురువుతో మురళియూదెడు నిండు
సొగసు గోముల[1]చుక్క సొక్కఁ జేయఁ
జిరుతనవ్వులడాలు చేనున్నవలమురి
గలమురిపెమునకుఁ గళుకు[2]నింప
[3]భైమిదక్షిణదిక్తటప్రాంతభూమి
సకలదివిజులతోడ సాక్షాత్కరించి
పుండరీకుని మనిచిన పాండురంగ
విఠ్ఠలాధీశుఁ గోటిరవిప్రకాశు.

66


సీ.

యాదవశిఖరి నత్యాదరంబున నున్న
రసికుఁ[4]జళ్ళఁపిళ్ళరాయశౌరి
హాళి సాలగ్రామ శైలంబున వసించు
నా స్వయంవ్యక్తు దీనాధినాథు
నైమిశకాననభూమి భక్తావన
మానితరంహు జ్వాలానృసింహు
నంత శ్రీరంగాంతరాఖ్యధామమ్మున
శ్రితజనావన[5]కల్పు శేషతల్పు
బదరివనమున నర్జునప్రాణసఖిత
నఖిలము [6]నెఱుంగుచున్న నారాయణాఖ్యు
నా ప్రయాగస్థలమ్మున నతులవిభవ
మహిమఁ గనుపట్టు శ్రీ మధుమాధవాఖ్యు.

67


క.

[7]తిరుపేరుత్తిరుమణియ[8]మం
దిరసీమన్ శ్రీధరాసతీసేవితుఁడై
చరణా[9]నతజనులకు నిహ
పరఫలములఁ గరుణనొసఁగు బాలముకుందున్.

68


సీ.

పురుషోత్తమస్థానమున నిండుకొలువుండు
శ్రీ జగన్నాథు లక్ష్మీసనాథు

  1. చొక్క. తా.
  2. నించ. తా.
  3. నైమి. తా.
  4. శళ్ళవిళ్ళ. తా.
  5. తల్పు. పూ. ము.
  6. నెరుగనున్న. తా.
  7. తిరుపెరు తిపురిమణి. తా.
  8. మందిరమున. పూ. ము.
  9. సుత. తా.