పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


[1]నెక్కొను సప్తర్షులకున్
దక్కిన యక్కారుకణ్ణి నరహరమూర్తిన్.

62


సీ.

పాదాబ్దరజమునఁ బాషాణపుత్రిక
వనితఁగాఁ జేయు పావనత ఘనత
హరశరాసవిభేద మవనిజాకల్యాణ
మునకు నుంకువ సేయు భుజబలంబు
మున్నీరు బాణాగ్రమున నాణిముత్తెంబు
భాతిగా నుంచిన పాటవంబు
వరశస్త్రశిఖిని రావణముఖా సురకోటి
శలభముల్ గాఁ జేయు శౌర్యమహిమ
తొలఁక లక్ష్మణ భరత శత్రుఘ్న వాయు
జార్కజ విభీషణాదులు నఖిలఋషులు
గొలువ వైదేహితోఁ గూడ నల యయోధ్య
రాజిలు దయాతిసాంద్రు శ్రీరామచంద్రు.

63


క.

ఆనందమయ విమానం
బానందమగరిమదాన నలరారు యశో
దానందతపఃఫలమగు
[2]నానందహారి నంజనాచలశౌరిన్.

64


గీ.

తిర్వలిక్కేణి దివ్యమందిర చరిష్ణుఁ
గృష్ణనామ రధాలంకరిష్ణుఁ గృష్ణు
నల [3]యహాబలపర్వతాధ్యక్షుఁ డైన
శ్రీయుతా[4]యతవక్షు శిక్షితవిపక్షు.

65


సీ.

చిప్పకూఁకటిరేఁక నొప్పు నౌఁదలమీఁద
చలిదిచిక్కము వింతచెలువుఁ గులుక
వ్రేతలవలపుఁ గొల్పెడు దిస్స మొలహత్తి
గచ్చకాయలతిత్తి ఱచ్చసేయ

  1. నెక్కును. తా. పూ. ము.
  2. నానంద కథా విధారి. తా.
  3. మ. తా.
  4. యుత. తా.