పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


వైకుంఠ[1]మున భాగవతులతో వసియించు
కువలయశ్యాము వైకుంఠనాము
కలశపాథోధిసంగత సితద్వీప ప్ర
సిద్ధసౌధనిల[2]యి శేషశాయి
మధురాపురీ హేమ[3]మందిరాంతర రత్న
మయసౌధవాసు రమావిలాసు
మరి [4]తిరున్వేలివిఖ్యాత వరతరా[5]ఖ్య
మైన తిర్వారయిప్పాడి నలరు శౌరి
శ్రీసతీయుక్తుఁ బట్టాభిషిక్తు ద్వార
కాపురీధాము భక్తరక్షణలలాము.

69


సీ.

తీర్థయాత్రావృత్తిఁ తిరుగుచు సేవింపఁ
గాఁగంటి నదియునుగాక మఱియు
ననఘ! శమ్యాప్రాస మను నాశ్రమమున స
త్యవతి[6]నందనుఁడే సుతటినిచెంత
నాగమవ్యాకరణాష్టాదశపురాణ
రమ్యార్థ[7]తరము భారతము సేసె
నాసరస్వతి నర్ణవాభ్యర్ణమునఁ జేర
నరుగు తుంగతరంగ నభ్రగంగ
రవిజ నంద విపాశ వేత్రవతి రేవ
సరయువు మలాపహారి భీమరధి వృద్ధ
గంగ కృష్ణయు కావేరి తుంగభద్ర
వేగవతి యాదిగాఁగల వివిధనదుల.

70


గీ.

పుణ్యతీర్థములైన త్రిపుష్కరములు
ద్వారవతి వారణాసి యవంతి మాయ
మధుర కాంచి యయోధ్య నా నధిక పాప
హరములై వార్త కెక్కిన పురవరములు.

71
  1. వరభోగ. పూ. ము.
  2. నీలాయి. తా.
  3. మందికాంతర తా.
  4. తిరువ్వెలిధి. తా.
  5. ద్య. తా.
  6. నకదనుఁడు యె తటని తా.
  7. రతము. తా.