పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27


సీ.

దళితాఘమగు తిరుతంగాల్పురమ్మున
శ్రీయుక్తుఁడైన నారాయణవిభు
మునినుతుండై తిరుమోహూర్పురి వసించు
ఖండిత [1]చండాఘుఁ గాలమేఘు
నల దక్షిణమధురాస్థలమున భక్తపా
లకుడైన కూడల[2]వకియనాము
శ్రీమించు కురువిత్తురీ పురంబున నతి
ప్రేమ దాసులఁ బ్రోవు కృష్ణదేవు
గరిమ శ్రీవిల్లిపుత్తూర సురలు మునులు
సన్నుతులు సేయఁ జెన్నారు మన్న[3]వారు
నగణితైశ్వర్యమునఁ దిరునగరి యేలు
నాదిలక్ష్మీసనాథు నయ్యాదినాథు.

61


సీ.

తులవెళ్ళిమంగాళాద్భుతపట్టణంబున
విలసిల్లు నయ్యరవిందనేత్రు
శ్రీవరమంగపురీనాథు నతసాధు
నమృతాంబునిధితనయాసనాధుఁ
తెందిరుర్పే[4]ర్పురియందుఁ జెన్నొందు పు
రందరస్తుతుఁ [5]గేశినేందసంజ్ఞు
వైకుంఠపట్టణ [6]వాస్తవ్యు భవ్యవై
కుంఠసంధాత వైకుంఠనేతఁ
గూర్మిమీఱఁ దిరుప్పుళిగుడి పురమ్ము
భూరివైభవమున నేలు భూమిపాలు
మంగపట్టణ మణిమంటపాంగణమున
నలరు నతదేవు విజయాన నాఖ్య దేవు.

52


సీ.

నగవుఁజూపులఁ గుళిందనగరి నున్న వ
ర్ణితశౌర్యు శ్రీ నవనీతచౌర్యు

  1. చండౌఘ. తా.
  2. శఘియ. తా.
  3. నారు. తా.
  4. పురి. తా.
  5. మకరమ్మనోజ్ఞు. తా.
  6. వాసవ్య. పూ.ము.తా.