పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఘటికాచలమాహాత్మ్యము


తిరుమణిక్కూడవణ్పురుషోత్తమములు శం
బొజ్జె కోవెలయును బురుడు లేని
యల్ల [1]పాత్తంపల్లి యరిమేయవిణ్ణహ
రము కావళంబాడి యమితవిభవ
మహము వైకుంఠ విణ్ణహరంబు నాతిరు
త్తేవనార్తోహము సేవకనిధి
యగుతిరుత్తెత్తియంబలంబనఘవచ్చి
దా మహామహిమారీతిఁదనరి భక్తిఁ
గొలుచు దాసుల కోర్కు లీఁ[2]గోరి ధరిణిఁ
దనరు నేకాదశోజ్జ్వలధామములను.

48


క.

విలయాంబుధిమగ్న మహా
వలయంబు సముద్ధరించు వరకీర్తియె యు
జ్జ్వలమూర్తిఁ బ్రవర్తిలెనా
నలరెడు శ్రీ[3]కృష్ణదేహు నాదివరాహున్.

49


సీ.

నతజనాధారు మన్నారు కోవెల యేలు
ప్రజసంచరిష్ణు శ్రీ బాలకృష్ణు
పాపనాశనపురీ భర్మహర్మ్యంబున
వసియించు నత రాజు వరదరాజు
నలపాండ్య నలధర నలహర్తిరుమలయన్
వీటవసించు శ్రీ వేంకటేశు
తిరుకోటియూర నిందిరఁ గూడి వర్తిల్లు
కృష్ణావినుతభావుఁ గృష్ణదేవు
విపుల[4]విభుతఁ దిరుమ్మెయివిణ్ణపురము
నెలమిఁ బాలించు సత్యగిరీశు నీశు
మునులతోఁ దిరుపుళ్ళానిపురినిసలిల
ధామ దీక్షాసమున్నిద్రు రామభద్రు.

50
  1. పాంతం.
  2. గోరు. తా.
  3. ముష్ణఁగీహు. తా.
  4. విభుతతి.....రుమ్మెయిణ్ణిపురవరమ్ము. తా.