పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25


తిరుణరయ్యూర దనరారు ద్విభుజ పరిఘు
పంకజ నికేతనాధీశు వేంకటేశు
మహిమ [1]నొప్పు నందిపుర విణ్ణహరనగరిఁ
జేరియున్న జగన్నాథు శ్రీసనాథు.

44


క.

తిరువిందళూర సకలా
మర పరికరముల్ తపస్సమాధి భజింపం
గరుణామతి వారలకున్
వరములొసంగిన [2]సుగంధివననాథు హరిన్.

45


సీ.

చిత్రకూటమ్మునఁ జెందమ్మి కొలని చెం
తం దనరారు గోవిందరాజు
శ్రీరామవిణ్ణహరీ పుర మేలు స
ద్భావుఁ ద్రివిక్రమ దేవదేవు
తిరుకూడలూర్పురాధిపు నుపమాతీతు
వర దయాంబుధిరాజు వరదరాజు
[3]ఖలసంహరుని తిరుక్కణ్ణంగుడి వసించు
శ్రీసౌఖ్య వర్దిష్ణుఁ జిన్నికృష్ణు
గరిమఁ తిరుకణ్ణమంగాఖ్య కటక మేలు
భక్తవత్సలదేవు దివ్యప్రభావు
హనుమమనుపం గపిస్థలమ్మునను [4]వెలయు
నింద్రశాత్రవవరదు గజేంద్రవరదు.

46


క.

భరతాద్యనుజులు సీతా
తరుణీమణి గంధవాహతనయుఁడు గొలువం
[5]దిరువెళ్ళియన్ గుడి నగరి
వెరవొప్పఁగ నేలు [6]దేవవిభు రాఘవునిన్.

47


సీ.

తిరుణాంగ[7]పత్తనాంతరసీమ [8]మాణిమా
దక్కోవెలఁ దిరువెళ్ళక్కొళంబు

  1. నచ్చిందిపురివిణ్నహరినగరిజె. తా.
  2. సుగంధవన. పూ. ము.
  3. ఖలనసంహారుని. తా.
  4. వేలయ. తా.
  5. తిరువెళ్ళియకుదినగరము.
  6. దేవి.
  7. పట్టణాంతర. తా.
  8. ను మణిషూడ. తా.