పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఘటికాచలమాహాత్మ్యము


ప్పురి నున్న శేషపన్నగ
వరదున్ ఫణితల్పశాయి వైభవదాయిన్.

39


క.

వర విభవములన్ సిరిచి
ర్పురమునఁ [1]బురహరసురేశ్వరుల్ భజియింపన్
ధరకుంబ్రత్యక్షంబౌ
గిరిభరణసహిష్ణు బాలకృష్ణున్ జిష్ణున్.

40


క.

చొక్కుణ్ణూరు పురంబున
నక్కౌశిక యజ్ఞవేది యం దుద్భవమై
రక్కసులఁ దునిమి దాసుల
యక్కరఁ దీరుచు జనార్ద నాహ్వయ మూర్తిన్.

41


చ.

ఘనమగు కుంభఘోణమునఁ గాంచనపుష్కరిణిన్ జనించు కాం
చన జలజాత నాయికను సన్నుతవైఖరిఁ బెండ్లియాడి కాం
చనమునికిం బ్రసన్నుఁ డగు [2]సారసపాణిని శార్ఙపాణి [3]
న్మునివరమస్తకోపరి సముజ్జ్వలపాణిని దేవతాగ్రణిన్.

42


క.

తిరుకండియూరు నాఁదగు
పురవరమున దనుజసమితిఁ బొలియింప సురో
త్కరముల మనుప న్నిలిచిన
నరరక్షాచణుని నాదినారాయణునిన్.

43


సీ.

తిరువిణ్ణహర్పుర దివ్యధామంబున
విలసిల్లు జగదీశు వేంకటేశు
తిరుకణ్ణపురవరాంతక విమానమ్మున
నిలుచు చతుర్భాహు నీలదేహు
తిరుమంగయాళ్వారు నరయు [4]తిర్నగరి నృ
హరిని లక్ష్మీశు నారాయణాఖ్యు
తిరు వాలిమణవాళ దివ్యనామమున శో
భిలు నాగపట్టణ వేంకటేశు

  1. పురహారప్రశహశురేశ్వరుల భజియింపన్. తా.
  2. సాదర. తా.
  3. త. తా.
  4. తర్వారితిర్ణహరిలక్ష్మీశ. తా.