పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

ఘటికాచలమాహాత్మ్యము


తిరుకురుంగుడి మహాపుర సౌధవీథిక
వజలు బృందారకవైరివైరి
పాలితసూరిఁ ది[1]ర్కోలూరిపురి హాస
ధవళాస్యు భక్తనిధాను శౌరి
న య్యనంతపురంబునం దహిశయ్యపై
మీఱు మురారిఁ జాణూర వైరి
సాధుజనయిత్రి[2]వన్పరిసర ధరిత్రి
వలను మీఱ వసించు శ్రీవత్సవత్సు
నా [3]తిరుక్కాత్కర పురంబు నాదరించు
నఖిలభక్తనిధాను నప్పాభిధాను.

53


సీ.

తిరుమూడికలమను దివ్యస్థలంబునఁ
గ్రీడించు నల పుండరీకనేత్రు
సుర లెన్నఁ గుట్టనాడ్తిరుపుళియూర్పుర
మున వసియించు నపూర్వనాధు
తిరుచెంగణూ ర[4]ను పురవరమ్మున నొప్పు
దివ్యభూవాస్తవ్యు దేవ సేవ్యు
నలువగొల్వ గఁ [5]దిరుణావై నగరిని వ
ర్తిలు ధీరనుతభావు దేవదేవు
వార్తకెక్కిన తిరువణ్ణ[6]వార్నగరిని
నున్న నతజనమందారు మన్ననారు
[7]నుతి యొనర్పనగు తిరువందూర్పురమున
నాత్తనరసఖ్యు నల ప్రవాళాధరాఖ్యు.

54


సీ.

అల తిరు[8]వత్తూర మను [9]పత్తనంబున
హరిశయ్యఁ దగు కేశవాభిధామ
నుత్త [10]చుక్కొండ నా నొప్పు పత్తనమున
నలరెడు నల య[11]నన్యగతినాథుఁ

  1. క్కోళూరి. తా.
  2. వణ్పరి శా. తా.
  3. తిరుక్కౌర్కెర. తా.
  4. వసత్యల్పన........స్తవ్యు. తా.
  5. తిరుణనాయి. తా.
  6. వాన్నగరిని. తా.
  7. నుతిగనుతమ....రు. తా.
  8. వాట్టార. తా.
  9. పట్టణంబున. తా.
  10. చుక్కోడ. తా.
  11. సస్య. తా.