పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

ఘటికాచలమాహాత్మ్యము


క్త పరాధీనత లంక దిక్కు మొగమై కాకోదరాధీశశ
య్య పయిన్ భాసిలురంగధాముని సహస్రాదిత్యభాధామునిన్.

28


సీ.

ఉపధానిత కరస్థితోత్తమాంగోత్తుంగ
ముకుట రత్నప్రభల్ రకముఁజూప
బ్రహ్మపేటీపుష్కరక్రోడ మదభృంగ
దంగంబు శృంగారభంగిఁదనర
రమ వంతునకు వచ్చు క్షమ లీల కప్పుడా
ల్మచ్చ పేరురమున ఱచ్చ సేయ
కౌస్తుభ గ్రైవేయ కనకకుండలహార
కేయూరకాంతులు క్రేళ్ళు దాట
సహ్యకన్యాతటోత్తాలసప్తసాల
రంగదామ్నాయశృంగైకరంగగేహ
శేషశయ్యను బవళించి [1]శ్రితులమనుచు
రవిసహసప్రభాదాము రంగధాము.

29


గీ.

అచటి కీశానహరిదంతలాగ్రవీథి
నందమైతగు తిరువాళురందధామ
మునను మునివాహనాహ్వయ మునివరేణ్యు
మనుప [2]వెలసిన యా జనార్దనుని ఘనుని.

30


గీ.

తపసిబృందంబు వెఱఁగొందఁ దపము సేయు
నల పరాశరమౌనిఁ గృతార్థుఁ జేయ
నవని సాక్షాత్కరించిన యసురహరుని
శ్రీసతీపతిఁ దంజాపురీనృసింహు.

31


క.

శ్రీమద్రంగమునకు మూఁ
డామడను గవేరజాతటాంచిత నంబి
ల్నామపురిం గనఁదగు శ్రీ
ధాముని సౌందర్యనాథు దైవతనాథున్.

32
  1. శ్రీతు. తా.
  2. వలసిన. పూ. ము. తా.