పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


క.

అరుదుగఁ గరంబనూరను
పురవరమునఁ బురహరాబ్జభూసుత్రాముల్
పరివేష్టింపఁగ నిలిచిన
యురు కరుణాపాంగసీము నుత్తమనామున్.

33


క.

తిరు[1]వెళ్ళరపురి శ్వేతశి
ఖరిపై నొర పైన దివిజకాంతలు గొలువన్
వర వైభవంబులును బొ
ల్చు రమాధవుఁ బుండరీకలోచనదేవున్.

34


క.

తెల్లముగఁ గుంభఘోణపు
రోల్లస దవిలాశ రెండు క్రోసుల నేలన్
బుళ్ళన్ [2]బుదకుడి నుండెడు
బల్లిదు రఘునాథు హృత కబంధ విరాధున్.

35


గీ.

ఉర్వి రంగస్థలమునకు యోజనమునఁ
బూర్వహరిదంచలమున నపూర్వమహిమఁ
దివిరి తిరుపేర్నహర్పుర దివ్యధామ
మందుఁ దగు పద్మనయను ననంతశయను.

36


గీ.

కుంభఘోణంపు వాయు దిక్కోణ భూమి
నమిత వైభవసామగ్రి నమరు [3]నాద
నూరఁ బ్రహ్లాదముఖులను గారవించు
జిష్ణు యోగీంద్రయోగవర్దిష్ణు [4]విష్ణు.

37


గీ.

కుంభఘోణంపు తూర్పునఁ గొమరు మీఱు
[5]తిరువళందూరఁ బావక దేవునకుఁ బ్ర
సన్నుఁడై యున్న దేవతాసార్వభౌము
వనజనయనుని గోపికావల్లభునిని.

38


క.

పరికించి కుంభఘోణ న
గరి కాగ్నేయాశఁ గడుఁ బ్రకాశించు చిరు

  1. నేళ్వర. తా.
  2. స్రధకుడి. తా.
  3. 1 యాద. తా.
  4. 2 జిష్ణ. తా.
  5. తిరువందళూర. పూ. ము.