పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


రాకాసుధాకర రాజన్ముఖ వధూత్క
రములచే మణిమందిరములచేత
సతత కిసలయ సుమఫలసహితమహిత
వనులచే దివ్యలోకపావనులచేత
వఱలు శాశ్వత లబ్ధాపవర్గయోగ్య
భాగ్యనికరంబు వైకుంఠపట్టణంబు.

24


సీ.

నును గాలిదూదిపానుపు లెన్నియో కాని
యందఱు శయనీకృతాహివరులు
సురలోకివాహినిర్ఝరము లెన్నియొ కాని
యందఱు దివ్యతీర్ధాంబుపదులు
నీట జనించు మానికము లెన్నియొ కాని
యందఱు కౌస్తుభహారయుతులు
చలి వేఁడి వెలుఁగుల సాము లెందఱొ కాని
యందఱు నిందు కంజాప్తదృశులు
ఖగకులాధీశు లెందఱు కలరొ కాని
యందఱును పుల్గురా టెక్కియములవారు
నాఱు వోసిన రీతి నున్నారు ధీరు
లన్నగరియందు కాపురంబున్నవారు.

25


ఉ.

అందొక కేళికామణిగృహమ్మున తారకకాంతకాంతశ
య్యం దగ నిందిరాసరసిజాననఁ గౌఁగిటనాదరించి యా
నందరసాబ్దిఁ దేలుచు ననారతమున్ సనకాదియోగిరా
డ్బృందము గొల్వ నున్న యఖిలేశ్వరభావుని వాసుదేవునిన్.

26


క.

సేవించి తత్పదార్చన
గావిం చిలఁ గలుగునట్టి కమలాధిప లీ
లావాసంబులు జూచితి
నావుఁడు నవి దెలుపుమనిన నారదుఁ డనియెన్.

27


మ.

ఉపధానీకృత హస్తతామరస సంయుక్తోత్తమాంగంబు ప
ద్మపుటాంతర్నివషనన్మద[1]భ్రమరరమ్యంబై విరాజిల్ల భ

  1. రమణ. తా.