పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఘటికాచలమాహాత్మ్యము


సీ.

ఘనరత్నరాశి కాకరము వియచ్చర
మానినీజనననిదానభూమి
సంతానభూరుహసమితికి నెలవు నా
రాయణ యోగనిద్రాస్థలంబు
వనజవాసినికిఁ బుట్టినయిల్లు దేవతా
విసరమ్మునకు మహానసగృహమ్ము
ద్వీపసంతతికి [1]బెన్ప్రాపు తరంగిణీ
భామినీమణులకుఁ బ్రాణభర్త
కలువనెచ్చెలికానికిఁ గన్నతండ్రి
గట్టుపట్టికి ధృఢవజ్రకవచ మగుచు
వెలయు పగ్గంపుకగ్గంపువిప్పుగంటి
సామినగరంబు ధర క్షీరసాగరంబు.

21


క.

ఆతంక పంకశంకా
పేతంపై నిత్యసత్యహితపూతంబై
[2]శీతాతపసహయోగి
స్ఫీతంబై తెల్లదీవి చెలఁగును దానున్.

22


క.

శ్రీకరమగు నద్దీవిన్
లోకాతీతానపాయనూత్నప్రభమ
స్తోకప్రభావకలితము
వైకుంఠపురంబు సిరుల వఱలు న్మిగులన్.

23


సీ.

హాటక హరినీల ఝాట ప్రదీప్త సా
లములచే నమర సాలములచేత
మందర కుధరోపమానిత సౌధ
తతులచే యోగిసంతతుల చేత
కమలకైరవభాస్వదమృత సరోవితా
[3]నములచే సుర విమానములచేత

  1. పెంబ్రాపు. తా
  2. సితా.........స్థితంబై. తా.
  3. ఈ పాదము తాళపత్రమున లేదు.