Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చరణము లంటి రాని, యల చాకలి పైదలి మర్మజావళిన్
బిరిగొనలేవు నీవు నొక భీకరమూర్తివె కాళికేశ్వరీ.

43


చ.

గొరియల, మేఁకపోతులను, గొమ్ముపొటేళ్ళను గావుగొందు వీ
వరయఁగ, సందెకాడఁ దగ వత్తు నటంచు భవచ్ఛిరంబుపైఁ
గర మిడి పోయినట్టి తిలఘాతుకురాలి తదీయశష్పముల్
పెఱుకఁగలేవు, [1]నీవుఁ గడు భీకరమూర్తివె కాళికేశ్వరీ?

44

శ్రీనాథుఁ డొక ప్రథమరజస్వలాగృహమునకుఁ బోయి భోజనసమయమందుఁ జెప్పిన పద్యము

ఉ.

దుష్పరివారశూన్యగతితో, మెఱుఁగై, సరసోచితోల్లస
త్పుష్పశరాసనఁక్రియకు బొల్పెసలారి మనోహరంబు నౌ
పుష్పసుగంధ్యనంగగృహపుణ్యమునన్ భుజియింపఁ గల్గె, వా
స్తోష్పతి కెన్ని యున్న సరి తూగినవే యొక శోభనంబుతోన్?

45


గీ.

[2]కాలకంధర! యీశాన! గరళకంఠ!
విసము మెసవిన గలుగు నక్కసబు వోవఁ
గొమ్మ మేడూరి కమ్మ చకోరనేత్ర
[3]పనిగొనఁగ రాదె యల యొంటి పనస తొలను.

46


క.

ముదివిటులు, విధవలంజలు,
పదకవితలు, మారుబాస బాపనవారల్,
చదువని పండితవర్యులు,
[4]కదనార్భటవీరవరులు కడిదిపురమునన్.

47


శా.

కుల్లా [5]యెత్తితిఁ, గోకఁ జుట్టితి, మహాకూర్పాసముం దొడ్గితిన్,
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ [6]విసికితిన్, విశ్వస్త వడ్డింపఁగా,

  1. నీవు నొక
  2. కాలకంధర! యీశాన! ఫాలనేత్ర!
    నీదు విష మారగించిన చేదు పోవ
  3. పనస తొన వంటి భగము చుంబనము సేయు
  4. కదనాస్థిర
  5. యుంచితి
  6. మెసవితిన్