Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

విమలాంభోరుహపత్రజైత్రములుగాఁ బెంపారు నేత్రమ్ములం
గమనీయంబగు కజ్జలం బునిచి, రేఖాసౌష్ఠవం బొప్ప, నా
గముతోఁ జేసిన సిందురంబు నుదుటం గాన్పింపఁ, బయ్యంటయున్,
యమునా రైకయు దాఁటి, పూపచను లొయ్యారంబు చూపన్ దుకా
ణముపై బొందిలి దోర్తు నిల్చె ముఖచంద్రస్ఫూర్తి శోభిల్లఁగన్.

39


శా.

[1]పొచ్చెం బింతయు లేని [2]హంసనడతోఁ, బొల్పొందు లేనవ్వుతోఁ,
బచ్చల్ దాపిన [3]గుల్కు ముంగరలతో, బాగైన [4]నెమ్మోవితో,
నచ్చంబైన [5]ముసుంగు వెట్టి, చెలితో నామాటలే చెప్పుచున్,
వచ్చెం బో! కుచకుంభముల్ గదలఁగా వామాక్షి తా నీళ్ళకున్.

40


శా.

హంసీయానకుఁ గామికి న్నధమరోమాళుల్ నభఃపుష్పముల్,
సంసారద్రుమమూలపల్లవగుళుచ్ఛంబైన యచ్చోట, వి
ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనం బుండి, ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచుం దర్కింతు [6]రాత్రైకమున్.

41


ఉ.

హా జలజాక్షి! హా కిసలయాధర! హా హరిమధ్య! హా శర
ద్రాజనిభాస్య! హా సురతతంత్రకళానిధి! యెందుఁ బోయితే?
రాజమహేంద్రవీథిఁ గవిరాజు ననుం గికురించి, భర్గకం
ఠాజితకాలకూటఘుటికాంచిత మైన యమాస చీఁకటిన్.

42


చ.

గొరియల, మేఁకపోతులను, గొఱ్ఱెపొటేళ్ళను, కోడిపుంజులన్
బరిపరి వీథులం దిరిగి భక్షణఁ జేసెద వింతె కాని, నీ

  1. ఒచ్చె౦ బింతయు లేక హంసనడతో నొయ్యారముం జూపుచున్ (సర్వల)
  2. యంచనడతో (?}
  3. కీల్కడెంపునగతో
  4. నెమ్మోముతో (సర్వల.)
  5. మండుగు గట్టి (సర్వల.)
  6. రశ్రాంతమున్.