Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధవళాబ్జరుచులు నాఁ దళుకులీనెడు నవ్వు
                        వెన్నెల నిగ్గుతో వియ్యమంద,
గొంతు కూర్చొని రసికుల దర్శన స్పర్శ
                        నంబుల మోహద్రవంబు జాఱ,


గీ.

నెడమ కుడి హస్తముల సన్న లెసఁగ, విటుల
రమ్ము ర మ్మని పిలుచు గారవము దోఁప,
నుర్వి మెఱయించు కార్పాసపర్వతంబు
చేరి మర్దించె, నొక్క పింజారితరుణి.

34


క.

ఆ కదురునఁ బికరవము,
న్నా కదురున భృంగరవము, నాత్మరవంబున్
ఏకీకృతముగ నేకు ల
నేకులు విన, వడికె ముదిర, యే కులముదిరా?

35


ఉ.

తెల్లమడుంగు గట్టి, యరుదెంచెడు పాంథుల ఱెప్పలార్పఁగా
నొల్లక చూచుఁ గాని, మదినున్న విధంబు విలాసవైఖరిన్
దెల్లమి చేసి, గాఢరతి నేలు నుపాయ మొసంగదయ్యె, నా
కల్లరి బొమ్మ యించుక విఘట్టన శూన్యపయోధరాగ్ర జా
గ్ర ల్లసమానతైక్ష్ణ లగుద్రావిడభామల కెంత వెఱ్ఱియో!

36


చ.

విటకరపీడనాది పరివేదన కోడి, శరీరజన్మ హృ
త్పుటమున వ్రాలి, పోవఁగను బోవఁగఁ బోవఁగ నాభిఁ గాంచి, య
చ్చటఁ బటుదీర్ఘదండహతిచేత విరోధమటంచుఁ దెల్పినన్,
దటుకునఁ బోక నిల్చిన విధంబున నుండెఁ గుచంబు లింతికిన్.

37


ఉ.

వన్నెల గాగరా జిలుఁగు వట్రువ కుచ్చిళులందుఁ బాదముల్
సన్నపు వారి [1]భంగము లసంబున నీగెడు బాలకూర్మముల్
గన్న తెఱంగు దోపఁ, గరకంజములన్ ముసుకున్ బిగించి, ప్ర
చ్ఛన్న ముఖాబ్జయై నడచెఁ జంగున, బొందిలిభామ గోమునన్.

38
  1. భంగముల సందున