Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చల్లా యంబలిఁ ద్రాగితిన్, రుచుల దోసం బంచుఁ బోనాడితిన్,
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుఁడన్.

48


సీ.

బొమవింటఁ దొడిగిన పూవిల్లుదొరముల్కి
                        పోల్కి కస్తురి సోగబొట్టు దిద్ది,
చకచక లీను తారకల తళ్కులు వోలెఁ
                        గొలుకులు వెడలఁ గజ్జలము దీర్చి,
పొడుపు గుబ్బలి మీఁదఁ బొడము నీరెండ నా,
                        రంగు చందురు కావి రైక దొడిగి,
పిఱుఁదు పొక్కిలి యను మెరక పల్లము గప్పఁ
                        బాల వెల్లువ మించు చేలఁ గట్టి,


గీ.

యంచ కొదమల గమి బెదిరించు లాగు
నందె చప్పుళ్ళు ఘల్లు ఘల్లనుచు మొరయ,
నడుము జవజవ లాడ, కీల్జడ చలింప,
వచ్చె ముక్కంటిసేవకు మచ్చెకంటి.

49


చ.

సరసుఁడు గాఁడొ? జాణ; రతిసంపద లేదొ? సమృద్ధి; రూపమో?
మరుని జయించు; మోహ? మసమానమె; యిన్నియుఁ గల్గి జారవై
తిరిగెదవేల బాల! యతి ధీరవు, ప్రౌఢవు నీ వెఱుంగవే?
నెర గృహమేధి యన్ పలుకు నీచము దోఁచెఁ, గొఱంతదే సుమీ!

50


మ.

అరవిందానన! యెందుఁ బోయెదవు? మత్ప్రాణేశుప్రాసాదమం
దిరదేశంబునకో లతాంగి! బహుళాంధీభూతమార్గంబునన్
దిరుగ న్నీ కిటు లొంటి గాదె? శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణధనుర్గుణాకలితుఁ డై మావెంట రా, నొంటియే?

51