Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

దరుణులకుఁ బంచబాణమందిరము లమరు
సుసరభేత్తను నీ మందు సోఁకినపుడు.

⁠ 80


వ.⁠

ఇది నిర్యాసమయంబును, సరభేదనసమర్థంబును నగుటం
జేసి, సుసరభే త్తను నామంబు దీనికిం గలిగెఁ, గామనిల
యాఘాటరోమాటవీసముత్పాటనపరిపాటికై పాటల
గంధులు దీనిం బాటింతు రనుచు నెఱింగించి, యట పోవం
బోవ, ముందట వెలిపాళెంబు మధ్యప్రదేశంబున, హాలికవాటి
యందు నొక్కచక్కని జవరాలు, కట్టెఱ్ఱ తొగరుం గఱ్ఱల యెఱ్ఱ
యొల్లియ నితంబభారంబున నమర్చి, బాలార్కకిరణసంప
ర్కంబునఁ, జాంపేయకుసుమచ్ఛదచ్ఛాయాదాయాదంబు
లైన యవయవంబులు మిసమిస మెఱవం, గుక్కుటాసనంబునం
గూర్చుండి,

⁠ 81

కాఁపుటిల్లాలి మౌగ్ఢ్యము

ఉ.⁠

[1]కందుకకేళి సల్పెడు ప్రకారమునం, బురుషాయితక్రియా
తాండవరేఖ చూపెడు విధంబునఁ బామరభామ, లేఁత యీ
రెండ ప్రభాతవేళ రచియించె, నితంబభరంబుఁ, జన్నులున్‌,
గుండలముల్‌, గురుల్‌, కదల గోమయపిండము లింటి ముంగిటన్‌.

⁠ 82


వ.⁠

అప్పామరభామారత్నంబు నుద్దేశించి,

⁠ 83


తే.⁠

పొలపములు లేవు కఱివంక బొమలయందుఁ,
జిన్ని నగవులు లేవు లేఁ జెక్కులందుఁ,
గలికితనములు లేవు క్రా ల్గన్నులందుఁ,
గాఁపుటిల్లాండ్ర కిట్టి మౌగ్ధ్యముల యొప్పు.

⁠ 84


వ.⁠

అట చని, వీథీవిటంకంబునఁ డిట్టిభుండు విటపేటికాప్రకాఘటిత

⁠
  1. ↑ చూ. శ్రీనాథుని వీథి. ప. 4)