| వ. |
అనుచు గోవింద మంచన శర్మ, నర్మసఖుండగు టిట్టిభుండును
దానును హట్టమార్గంబునం జనునప్పుడు,
| 76
|
సుసరభే త్తను వేడుకమందు నమ్ము బోటి
| తే. |
జిగురుటుండలు నించి, డా చేతియందుఁ
బెద్ద యేనుఁగు దంతంబు పెట్టెఁ బెట్టి,
యింతులకుఁ బ్రీతిగా మైల సంతలోన
‘సుసరభే’త్తని ఘోషించె జోటి యోర్తు.
| 77
|
| వ. |
ఇది యేమి ఘోషించుచున్నయది? కిరాటకులరత్నంబ! నీవు
తేటపడ నెఱింగి, మాకు నెఱింగింపు మనుచు మంచనశర్మ
యడిగిన,
| 78
|
| చ. |
ముసిముసినవ్వుతో నతని మోము గనుంగొని వైశ్యుఁ డి ట్లనున్;
రసికకులావతంసుఁడవు బ్రాహ్మణ! యింతకు మున్నెరుంగవే?
యసమశరాలయంబునను హత్తిన వెండ్రుక కప్పు వోవఁగా,
విసరు సమీరణం బయిన వేడుక మం దిది, కొందు రంగనల్.
| 79
|
| సీ. |
కమఠావతారంబుఁ గైకొన్న దైత్యారి
కమనీయచరమభాగంబు వోలె,
నాదియుగంబునం దావిర్భవించిన
జిననాథదేవుని శిరసు వోలెఁ,
గసటు వోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ
బెట్టిన తామ్రంపుబిందె వోలెఁ,
గంగమట్టియతోడ సాంగత్య మెడలిన
నునుపారు మునిమిట్టనుదురు వోలెఁ,
|
|
| తే. |
జిఱుత ప్రాయంపునాఁటి సజ్జికపుఁ జాయ
తొలు సమర్తయకాలంపు విలసనమునఁ
|
|