|
కటగారకులవధూటీ
కుటికాగారంబు, గరడి కుసుమాస్త్రునకున్.
| 69
|
క. |
[1]గీసిన వెదురుసలాకల
నేసిన యిరుఁదల శిఖండి నిడు మంచమునం
దోసరిలి, కటకుటీరవి
లాసిని రమియించు మిండలసహస్రములన్.
| 70
|
ఉ. |
పల్లవతస్కరుం డొకఁడు, ప్రాక్సముపార్జితతారపంక్తితో
వల్లువ మెత్తికొంచుఁ బెడవాకిట వెళ్ళిననాఁటనుండి, పా
టిల్లిన శంక, నీ కటకుటీరవిలాసిని యహ్హహా! పటీ
పల్లవకోణముల్ బిగియఁబట్టి, రమించును మిండగీలతోన్.
| 71
|
వ. |
ఆ చేడియం జూచి, యట పోవం బోవ ముందట,
| 72
|
చెఱకువిలుకానిములికి చండాలభామ
శా. |
గం డాభోగము పజ్జ లేనగవు శృంగారింపఁ గ్రేఁ గన్నులన్
మెండై మించు మెఱుంగుఁ జూపు గమి క్రొమ్మించుల్ పిసాళింపఁగాఁ,
జండాలాంగన వచ్చె నొక్కతె ఋతుస్నానార్థమై, యిక్షుకో
దండుం డేర్చినబాణమో యనఁగ సౌందర్యంబు నిండారఁగన్.
| 73
|
కర్ణాటి కలికితనము
మ. |
కటిభారంబును, జన్నుదోయి భరమున్ గల్పించె నా బ్రహ్మ పి
న్నటి కౌఁదీగకు మున్న, యిప్డు విమలార్ణఃపూర్ణమై యున్న యీ
ఘటిభారం బొకఁ డెక్కు డయ్యె ననినన్, గర్ణాటి క్రా ల్గన్నులన్
బటి తాళింపుచు నవ్వె, నీలకబరీభారంబు కంపింపఁగాన్.
| 75
|
- ↑ కీసిన (మూ.ప్ర.)