పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

డిరోయంచు నౌత్సుక్యమున్ జెంది మీమూర్తి దర్శింప నేకా
గ్రచిత్తంబునన్ బూని ధ్యానింపఁగా మీరు సద్యస్స్థితోద్యద్వి
లాసంబుతో నిందుఁ బ్రత్యక్షమై వచ్చినంజూచి వేభంగుల న్మి
మ్ముఁ గైవారముల్ చేసి తన్మంగళాకారలేఖావిశేషంబుతో నిం
డు నిల్వంగఁ గాంక్షించినన్ దత్స్వరూపంబులో నెమ్మిఁ బ్రత్య
క్షమై మీ రగస్త్యేశనామంబుతో నిల్చి యోగీంద్రసంసేవితై
కాంతభావంబుతో నుండఁగాఁ బెద్దకాలం బతిక్రాన్తమై యే
గె నావెన్క నుద్యత్కలివ్యాప్తి వర్తించె నిట్లుండఁగా నొక్కకా
లంబున న్నీదుపూజాకరుండైన పూజారియొక్కండు వారాం
గనానిత్యసాంగత్యశీలుండు నీపూజనార్ధంబుగాఁ గూర్చియు
న్నట్టి చొక్కంపుమేల్తావిపూదండ లావేశ్య కైశ్యమ్మునం దుం
చి యాకల్కితోఁ గుల్కి పూముల్కివిల్కానిమేల్కేలి గావిం
చి తద్గణ్యలావణ్యపణ్యాంగనాభుక్తశేషంబులై నాంతమూ
ల్యంబులైనట్టి మాల్యంబులం దెచ్చి నీపీఠభాగంబునం దుంచి
నీదివ్యసందర్శనార్ధంబుగా వచ్చి యున్నట్టి భూమండలస్వామి క
ర్పింపఁగా నాతం డాపూలదం డాత్మహస్తాబ్జమం దుంచి వీక్షింప
గా నందు నీలంపురాసొంపుడా లింపుగా నింపుమేలౌ శిరోజం
బొకం డుండినం జూచి యాతం డుగగ్రాగ్రహవ్యగ్రుఁడై స్వా
మినీిర్మాల్యమౌ మాల్యమం దిప్పు డీగంధతైలార్ద్రచంచచ్ఛిరోజం
బు రాఁ గారణం బేమి? యోభ్రష్టదుష్టార్చకా? యన్న భీతాత్ముఁ