పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

డై వాఁడు సర్వాంగముల్ కంపమొందంగ నోచండకోదండ
దోర్దండభూమండలాఖండలా సావధానంబుగాఁ జిత్తగింపంద
గున్ భూమిదేవా మదీయూపరాధంబు లే దీశీరోజోత్తమం బెంత
మాత్రంబును న్వేఱుగా దీసుధాంశూజ్జ్వలన్మౌళిదేగాని యం
చున్ దిటంబొప్పఁగాఁ బల్కినన్, విస్మయంబంది యామాన
వాధీశ్వరుం డిట్టిదృష్టాంతము న్మాకుఁ జూపింతువా చూపలేకున్న
నీకున్ శిరశ్ఛేదరూపంబుగా శిక్ష సేయింతు, మన్నన్, "సరే
చూడుఁడీ క్ష్మాతలాధీశ" యంచుం బ్రకాశంబుగాఁ బల్కి తా నం
తఱంగంబులో "నీశమాం రక్ష రక్షేతి" వాక్ప్రార్థనైకాగ్రనిష్ఠా
పరాయత్తుఁడై యుండఁగా నప్పు డీ వొప్పుగా మెప్పుగాఁ దప్పులే
కుండఁగా ముప్పురాకుండఁగా రప్పు లేకుండఁగా గొప్పు పోకుం
డఁగాఁ దాల్చి మీభక్తసంత్రాణదీక్షామహోదారవిస్ఫూర్తి
లోకంబునం దేటతెల్లంబుగాఁ జూపియున్నట్టి ప్రత్యక్షదై
వంబ వోస్వామి నీదివ్యలీలాచరితంబు లెన్నెన్నియో సన్నుతిం
పంగ నెవ్వారిశక్యంబు సర్వామరగ్రామణీ! దీనచిన్తామణీ!
యార్తరక్షామణీ! హృత్తమోద్యోమణీ! సోమ నీదాసుడం బ్రేమ
న న్నేలి రక్షింపు మీశా! నమస్తే నమస్తే నమః!

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీం శ్రీం॥ ఓంతత్సత్॥
ఇది శ్రీకూచిమంచి సోమసుందరకవికృతులందు
శ్రీకొప్పులింగేశ్వరదండకము.