పుట:కొప్పులింగేశ్వరశతకము (కూచిమంచి సోమసుందరుఁడు).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీహయగ్రీవాయ నమః

కొప్పులింగేశ్వరదండకము

      శ్రీమన్మహాఖండగోదావరీప్రాక్తటప్రోల్లసద్రాజమా
హేంద్రవిఖ్యాతపూర్ధర్మదిఙ్మండలద్వాదశక్రోశదూరస్థిత
క్ష్మాలసత్కౌశికీదివ్యతీరోజ్జ్వలత్ఫల్వలక్షేతవాసా! జగద్వా
స నీదివ్యచారిత్రముల్ గూర్చి పూదండగా దండకం బొక్కఁ
డర్పింతు నీ కేను గైకొమ్ము మేలిమ్ము శ్రీ లిమ్మువే కొప్పులింగా
హ్వయశ్రీమహాదేవదివ్యప్రభావా! విశుద్ధస్వభావా! కృపాపూ
ర్ణభావా! సజాతీయభేధాద్యభావా నిజాధీనజీవా! భవారణ్య
దావా! భవద్దివ్యచారిత్రముల్ పూని వర్ణింప నే నెంతవాఁడన్
సహస్రాస్యముల్ కల్లు శేషాహి కింతైన శక్యంబు గాదన్నచో
నజ్ఞులైనట్టి మాబోటిమూఢాత్ములం జెప్పఁగానేల? దిక్చేల!
దృక్ఫాల! ముంగుంభసంభూత మౌనిప్రకాండుండు కైలాస
శైలాంచితాథిత్యకాభూమి శీతాద్రిరాట్కన్యకాభవ్యక
ళ్యాణదివ్యోత్సవారంభవేళం ద్వదీయాజ్ఞచే లోకబాధాప
వోదార్థమై ద4క్షిణాశాతటీభూమికి న్వచ్చుచో నిచ్చట న్ముచ్చ
టం జేరి మీ రచ్చటన్ దత్సకాలంబు(నం) దుత్సవంబొప్ప నెట్లుం